Ramoji Rao : రామోజీరావుకు భారీ షాక్‌..? ఉండ‌వ‌ల్లిదే విజ‌యం..?

Ramoji Rao : రామోజీ రావు ఫిలిం సిటీ అధినేత రామోజీరావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఎన్నో సినిమాల‌కి కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.మీడియాను అడ్డుపెట్టుకుని రామోజీ చేస్తున్న వ్యాపారాల్లో అనేక మోసాలు జరగుతున్నట్లు ఎప్పటినుండో ఆరోపణలున్నాయి. ఏ వ్యాపారాన్ని తీసుకున్నా చట్ట ఉల్లంఘనలు, అక్రమాలే ఉంటాయని మంత్రులు కూడా చాలాసార్లు ఆరోపించారు. ముఖ్యంగా ఉండ‌వ‌ల్లి రామోజీరావుపై అనేక ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రామోజీరావుకి చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ‌ మోసాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లాయర్ నోరిప్పారు.

విచారణలో ఆర్బీఐ లాయర్లు ఎన్నిసార్లు పాల్గొన్నా పెద్దగా మాట్లాడింది లేదు. అయితే తాజాగా జరిగిన విచారణలో ఆర్బీఐ లాయర్ మాట్లాడుతూ హెచ్యూఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబం) పేరుతో డిపాజిట్లు సేకరించటం చట్ట విరుద్ధమని స్పష్టంగా చెప్పారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించకూడదన్నారు. మార్గదర్శి ఛైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో కోడలు శైలజ దశాబ్దాలుగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తుకుంటున్నారు. మార్గదర్శి చిట్స్ గురించి కేంద్రప్రభుత్వం అడిగితే తనకు కేంద్ర చట్టాలు వర్తించవని చెబుతారట. రాష్ట్రప్రభుత్వం అడిగితే తాను రాష్ట్రప్రభుత్వం చట్టాల ప్రకారం వ్యాపారం చేయటంలేదని చెబుతారని ఉండవల్లి సెటైర్లు వేస్తున్నారు.

Ramoji Rao facing problems undvalli got win
Ramoji Rao

ఏ చట్టమూ వర్తించకపోతే ఏ చట్టం ప్రకారం మార్గదర్శి చిట్స్ వ్యాపారం చేస్తున్నారో రామోజీయే చెప్పాలని ఉండవల్లి చాలాసార్లు డిమాండ్ చేశారు. అయితే ఎందుకు ఇలా చేశారు అంటూ పలువురు ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు.ఉండవల్లి ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా రామోజీ మోసాలు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు విచారణలోనే బయటపడిందట. కాకపోతే విచారణను పూర్తిచేసి తీర్పు చెప్పటం ఒకటే మిగిలిందని మాజీ ఎంపీ పదేపదే చెబుతున్నారు. అదృశ్య శక్తి ద్వారా విచారణ పూర్తికాకుండా రామోజీ అడ్డుకుంటున్నట్లు కూడా ఉండవల్లి ఆరోపించారు. తాజాగా ఆర్బీఐ లాయర్ చెప్పిన విషయంతో మార్గదర్శి వ్యాపారమంతా మోసాలే అని అర్థ‌మవుతోందని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా ప్రజల నుండి రామోజీ రూ. 4,600 కోట్లు వసూలుచేసినట్లు చెప్పారు. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదావేసింది. మరారోజు ఏమవుతుందో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago