Seethakka : ఏంటి.. సీత‌క్క బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి మొత్తం ఖ‌ర్చు చేశాడా..!

Seethakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన విషయం మ‌నందరికి తెలిసిందే. ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. ఈమె అస‌లు పేరు అనసూయ దంసారి. సీతక్కగా పరిచయమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలపై పోరాడుతూ.. నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్దికి పాటుపడుతుంటారు. అందుకే ఆమెను పేద ప్రజల పెన్నిధి అంటారు.

సీతక్క వరంగల్ జిల్లా ములుగు మండలం.. జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జులై 9, 1971 లో జన్మించింది. తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్క దంపతులకు ఆమె రెండో సంతానం. సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ.. పదవ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు.ఆమె 1988 లో నక్సల్ పార్టీలో చేరారు. అప్పుడు సీతక్క వయసు 14 ఏళ్లు, పదవ తరగతి చదువుతున్నారు. నక్సల్స్ లో చేరిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. అలా అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం పదిహేనేళ్ళకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. తన బావ శ్రీరాముడిని పెళ్లి చేసుకొని తన పేరు సీతక్కగా మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక 1996 లో జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు.

cm revanth reddy did Seethakka daughter marriage
Seethakka

అయితే సీత‌క్క బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి సాయం చేశాడ‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. ఆ స‌మ‌యంలో సీత‌క్క స్పందిస్తూ ఆయ‌న త‌నవంతు సాయం అందించారు. అయితే మేము ఖ‌ర్చు పెట్టాం అంటున్నారు. కాని మేము ప్ర‌జ‌ల‌కి భోజనం పెట్టేందుకు ఎక్కువ ఖ‌ర్చు చేశాం త‌ప్ప పెద్ద‌గా ఏమి చేయ‌లేదు. ప‌ట్టు చీర‌లు, నగ‌లు వంటి వాటికి మేము ఎక్క‌డ ఖ‌ర్చు చేయ‌లేదు అని సీత‌క్క క్లారిటీ ఇచ్చింది. ఇక కరోనా సమయంలో చాలా మంది నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు.. కానీ సీతక్క తన ప్రాణాలు లెక్క చేయకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా తన నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ అహారం, నిత్యవసర వస్తువులు స్వయంగా అందజేశారు. ఒక ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం పని చేయాలని నిరూపించారు. అప్పట్లో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిశాయి.

Share
Shreyan Ch

Recent Posts

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

17 hours ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

1 day ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

1 day ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

1 day ago

YS Jagan : జైలు ముందు జ‌గ‌న్‌తో మ‌హిళా కానిస్టేబుల్ సెల్ఫీ.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

YS Jagan : ఈ ఎన్నిక‌ల‌లో ఘోరంగా ఓడిన జ‌గన్ ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌భుత్వంపై ఏదో ఒక విధంగా విమ‌ర్శలు…

1 day ago

Harish Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం పోయింది: హ‌రీష్ రావు

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం, ఇష్ట‌మొచ్చిన‌ట్టు…

2 days ago

ఏపీ మందు బాబుల‌కు గుడ్ న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం..?

గ‌త ప్ర‌భుత్వంలో నాసిర‌కం మ‌ద్యం వ‌ల‌న చాలా మంది చాలా ఇబ్బందులు ప‌డ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…

2 days ago

YS Sharmila : చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర పాకెట్ మ‌నీ వ‌సూలు చేయ‌డం ఏంటి: ష‌ర్మిళ

YS Sharmila : వైఎస్ ష‌ర్మిళ ఇటు తెలంగాణ‌, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…

5 days ago