YS Jagan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బస్సు యాత్రతో దూకుడు పెంచగా, మరోవైపు జగన్ కూడా ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచుతున్నారు. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు జగన్. ఇప్పటికే కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర పూర్తి కాగా.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ పరిపాలన మీద మరో సరికొత్త పాట విడుదల అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ పాలన, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలపై విడుదలైన పాటలన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక, తాజాగా ఈ జాబితాలో మరో పాట చేరింది. ‘వీ లవ్ జగన్’అనే కొత్త సాంగ్ రిలిజ్ అయ్యింది. ఇక విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.అయితే ఈ సారి ఏపీ లో అధికారం ఎవరికి దక్కుతుంది అనే దానిపై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలువురు అనేక సూచనలు చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ కృష్ణమాచార్య వైఎస్ జగన్ పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావొచ్చు, అలానే జనసేన అధినేత పవన్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రజారాజ్యం ఏ పరిస్థితులలో వచ్చిందో మనందరికి తెలుసు. కచ్చితంగా పవన్ కళ్యాణ్ జీవిత కాలం గురించి ఏవేవో చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తప్పకుండా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారని చెప్పొచ్చు. చంద్రబాబు గురించి మాట్లాడిన ఆయన చంద్రబాబు జాతక ప్రకారం ఆయనకి పలు సమస్యలు ఎదురవుతాయి. గతంలో ఆయనకి పెద్ద ప్రమాదం సంభవించింది. లోకేష్ రాజకీయ భవిష్యత్ కూడా అంతగా ఏమి బాగుండదు అని జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు.