ప్రస్తుతమంతా సోషల్ మీడియాదే హవా.. ఇంటర్‌నెట్ పుణ్యమా అని రోజుకో కొత్త డిస్కషన్, ఛాలెంజ్, వింతలు, విడ్డూరాలు చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే రకరకాల వీడియాలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. మారుమూల పల్లైనా లేదా సిటీ అయినా ఎక్కడ ఆసక్తికర సంఘటన జరిగినా నెటిజన్లు దానిని వైరల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి రాగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది.
కోళ్ల కంటే రూస్టర్‌లు మనుషులతో తక్కువ స్నేహాన్ని కలిగి ఉంటాయి మరియు కొన్ని సమయాల్లో యుద్ధభరితంగా ఉంటాయి. ఈ వీడియోలోని వ్యక్తి రూస్టర్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తి కర్రతో కోడి దగ్గరికి వచ్చి కొట్టడానికి ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. ఆ వ్యక్తి రూస్టర్ దగ్గరికి వచ్చిన వెంటనే, అది భయపడి.. రెచ్చిపోయి ఎదురు తిరుగుతుంది.
దీంతో ఆ వ్యక్తి భయంతో ఓ చిన్న కొండ వైపు అరుస్తూ వెనిక్కి పరిగెత్తుతుండగా అక్కడే ఓ చెట్టుకి చిక్కుకొని కింద పడిపోతాడు. అనంతరం అక్కడ నుంచి వేగంగా పరిగెత్తి ఆ రూస్టర్ దాడి నుంచి తప్పించుకుంటాడు. ఇంతలో వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి బిగ్గరగా నవ్వడం గమనించవచ్చు. ఈ వీడియోను ‘కుమారాయుష్21’ అనే యూజర్ ట్వీటర్ లో పోస్ట్ చేయగా.. అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నిస్సహాయ జంతువుకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తే.. మనిషికి త్వరగా కర్మ లభిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
मुर्गे से पंगा..न रे न pic.twitter.com/DmStZanUmU
— Ayush Kumar (@kumarayush084) October 31, 2022