Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు ఒక ప్రభంజనం. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. పలు సభలలో ఆయన భారీ స్పీచ్ లు కూడా ఇస్తూ హాట్ టాపిక్ ఇస్తున్నారు. అయితే పవన్‌కి చాలా సిగ్గు ఎక్కువ. సభలలో అంత గాంభీర్యంగా మాట్లాడిన కూడా కొన్ని సందర్భాలలో మాత్రం చాలా సిగ్గుపడిపోతుంటారు. ఇది మనం ఎన్నో సార్లు చూశాం. తాజాగా పవన్ ఓ కార్యక్రమానికి హాజరు కాగా, ఆయనకి ఓ మహిళ నుదుటిన తిలకం పెడుతుండగా, ఆ సమయంలో పవన్ చాలా సిగ్గుపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ కు మరోవైపు సొంత పార్టీలో టికెట్ల తలనొప్పి పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈసారి తమ కూటమి తరఫున అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్న కోస్తా ప్రాంతంలోని ఉత్తరాంధ్రలో సీట్ల వ్యవహారం పవన్ ను చికాకు పెడుతోంది. తన సీటు కంటే ఇతరుల సీట్ల కోసమే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన పరిస్ధితుల మధ్య ఆయన ఇవాళ విశాఖ పర్యటన ప్రారంభిస్తున్నారు. నిన్న మొన్నటివరకూ ఉత్తరాంధ్రలో కీలకమైన అనకాపల్లి ఎంపీ సీటుకు పార్టీలో చేరిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ దాదాపుగా ఖరారు చేసేశారు.
![Pawan Kalyan : నుదుటిన పవన్‌కి మహిళ తిలకం పెడుతుంటే ఎంత సిగ్గుపడిపోయాడు..! woman put sindhur on Pawan Kalyan forehead](http://3.0.182.119/wp-content/uploads/2024/02/pawan-kalyan.jpg)
ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన తన సోదరుడు నాగబాబు కన్ను కూడా ఈ సీటుపైనే పడింది. అదీ ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా వెళ్లాలని భావిస్తున్న నాగబాబు అనకాపల్లిలో తాజాగా జరిగిన పర్యటన, చేసిన హంగామా ఇప్పటికే ఆ సీటును ఆశిస్తున్న కొణతాల రామకృష్ణకు ఇబ్బందిగా మారింది. దీంతో నాగబాబు టూర్ కు ఆయన దూరంగా ఉండిపోయారు. దీంతో నాగబాబు స్వయంగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనకాపల్లి ఎంపీ సీటులో తాను, ఎమ్మెల్యేగా కొణతాల పోటీ చేస్తే బావుంటుందని సూచించారు. దీనికి ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ లో కొణతాలతో భేటీ అయి దీనిపై ఓ పరిష్కారం చేయాలని భావిస్తున్నారు.