Sr NTR : దేశం గర్వించదగ్గ దర్శకులలో దాసరి నారాయణ ఒకరు అని తప్పక చెప్పాలి. టాలీవుడ్ లో దాసరి నారాయణది ఒక గొప్ప అధ్యాయం. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా విజయం సాధించి బహుముఖ ప్రజ్ఞ అనిపించుకున్న ఆయన కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించారు.ఆయనకు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో లెక్కే లేదు. అప్పట్లో దాసరి ఏడాదిలో పదుల సంఖ్యలో చిత్రాలు తీసేవారు. రాత్రి పగలు తేడా లేకుండా సినిమా కోసం పని చేసినప్పటికీ అవి ఎంతో క్రమ శిక్షణతో చేశారు.
అయితే దాసరి ఓ సారి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఓ కోరిక కోరారట. సినిమా పరిశ్రమ నుంచీ ప్రతినిధి వర్గం ఆయన దగ్గరకు పోగా, అందులో దాసరి నారాయణరావుగారు కీలకంగా ఉన్నారు. ఏమిటి సమస్య అంటూ దాసరిని ఉద్దేశించి ఎన్టీఆర్ అడిగారు. అయ్యా ఎగ్జిబిటర్లు బావురుమంటున్నారు అన్నారు దాసరి. దాంతో ఎన్టీఆర్ నాకు ఆరు సినిమా హాళ్లు ఉన్నాయి. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే వాడు బాధ పడుతుంటే వాణ్ణి పట్టుకురండి.. వింటాను అని పంపేశారు.అలా అన్నగారు పెట్టిన స్లాబు పద్దతి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తీసేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు డెబ్బై రూపాయలుగా ఉన్న బాల్కనీ రేట్ ను యాభై కి తగ్గించారు వైఎస్. ఇదిలా ఉంటే దాసరి కూడా ఓ సందర్భంలో ఎన్టీఆర్ కోపానికి గురయ్యారట. ఎన్టీఆర్ బొబ్బిలి పులి సమయంలో ఈ అరుదైన సంఘటన జరిగిందట. ఈ విషయాన్నీ ఓ వేదికపై దాసరి స్వయంగా చెప్పడం జరిగింది. 1982లో చెన్నైలోని ఏ వి ఎమ్ స్టూడియో బొబ్బిలి పులి షూటింగ్ జరుగుతుంది. క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీఆర్ ఉదయాన్నే సెట్ కి వచ్చారట. సెట్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ డైలాగ్స్ రాసుకుంటున్న దాసరిని చూడగానే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. ఉదయం ఏడు గంటల లోపు మొదటి షాట్ పూర్తవ్వాలన్న నియమం పెట్టుకున్న ఎన్టీఆర్ కి దాసరి తీరు నచ్చక స్టూడియో నుండి ఆగ్రహంగా ఇంటి నుండి వెళ్లిపోయారట. ఆ సంఘటనతో సెట్ మొత్తం షాక్ అయింది.