Viral Photo : సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. వారి పిక్స్ చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. తాజగా తెలుగులో బాలనటిగా పలు సినిమాలు చేసి, ఆ తర్వాత టీనేజ్ లోనే హీరోయిన్ గా మారి స్టార్ హీరోల అందరి సరసన నటించిన హీరోయిన్‌కి సంబంధించిన చిన్నప్పటి ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇప్పుడు ఈ హీరోయిన్ సీరియల్స్ లో కూడా నటిస్తూ అలరిస్తుంది. ఆమె ఎవరో గుర్తొచ్చిందా.. అలనాటి అందాల నటి రాశి. రాశి బాలనటిగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. రాశీ జీవితం గురించి ఎవ్వరికి తెలియని విషయాలే చాలానే ఉన్నాయి.
రాశి అసలు పేరు విజయలక్ష్మి కాగా, ఆమె బాల్యంలో ఉన్నప్పటి నుంచే నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత స్టార్ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసింది. పెద్దల అంగీకారంతోనే ఆమె డైరెక్టర్ శ్రీనివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, శ్రీనివాస్‌ను ఆమె పెళ్లి చేసుకోవడానికి ముందే మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకుంది. రాశి ముందుగా కోలీవుడ్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్‌ను 18 ఏళ్ల వయస్సులోనే ప్రేమించింది. అయితే వీళ్ల ప్రేమకు రాశి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత మనస్తాపానికి గురైన రాశి అతడికి దూరమైంది.
అనంతరం ఆమె మనసిచ్చిచూడు దర్శకుడు సురేష్‌వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడి చేతుల్లో కూడా రాశి మోసపోయిందని , ముచ్చటగా మూడోసారి డైరెక్టర్ శ్రీనివాస్ ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందని చెబుతుంటారు. ప్రస్తుతం గిరిజ కళ్యాణం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ చేస్తోంది. ఇక ఈ అమ్మడు గోకులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, సముద్రం, కృష్ణబాబు, మూడు ముక్కలాట, ఆమ్మో ఒకటో తారీఖు, సందడే సందడి లాంటి సూపర్ హిట్స్ సినిమాలలో నటించి మెప్పించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…