విక్టరీ వెంకటేష్ హీరోగా ఏడాదిలో రెండు సినిమాలు నిర్మించిన నిర్మాత కేవీబీ సత్యనారాయణ. ఆయన నిర్మించిన చిత్రాలలో సుందరాకాండ ఒకటి కాగా, ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చెన్నై వెళ్లిన రాఘవేంద్రరావు రజినీకాంత్ హీరోగా నటించిన అన్నమలై సినిమాను చూశారు. ఇది ఆయనకు ఎంతగానో నటించింది. అయితే ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలా మంది పోటి పడ్డారు. ఈ క్రమంలో కేవీబీ సత్యనారాయణ భారీ మొత్తాన్ని ఖర్చుచేసి రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఏ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో చిరంజీవితో చేస్తే బాగుంటుందని అనుకున్నారు.
ఒకానొక సమయంలో సత్యనారాయణకు ఫ్లైట్ లో చిరంజీవి కలిసారు. అప్పుడు కథను ఫైట్ లోనే వినిపించారు. కథ నచ్చడంతో మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఓ సమయంలో సుందరకాండ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లారు సత్యనారాయణ. విషయం వెంకటేష్‌కి చెప్పడంతో ఆ సినిమా కూడా మనమే చేద్దామని అన్నారు. వెంకీతో మరో ఛాన్స్ వచ్చినందుకు సంతోషపడాలో, చిరంజీవితో ఛాన్స్ మిస్ అవుతుందని బాధపడాలో కేవీబీకి అర్ధం కాలేదు. చివరికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కొండపల్లి రాజా సినిమా చేసి హిట్ అందుకున్నాడు.
అయితే ఓ నవల ఆధారంగా 1987లో హిందీలో ఉదాగస్ సినిమా తెరకెక్కగా, ఈ సినిమా ఆధారంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు తెలుగులో ప్రాణస్నేహితులు అనే సినిమా చేశారు. ఈ సినిమాని బేస్ చేసుకొని తమిళంలో అన్నమలై తెరకెక్కింది. దీన్ని కొండపల్లి రాజాగా రీమేక్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణం రాజు కేసు వేశారు. ఆ సమయంలో నిర్మాత జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆయన సన్నిహితులు ఏదోలా మేనేజ్ చేసి నిర్మాత జైలుకి వెళ్లకుండా ఆపగలిగారు. మొత్తానికి కొండపల్లి రాజా సినిమా విషయంలో చాలా ట్విస్ట్‌లే నడిచాయి.