మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు విష్ణు ఇటీవలి కాలంలో ఒక్క విజయం కూడా అందుకోలేకపోతున్నాడు. చివరిగా మోసగాళ్లు చిత్రంతో దారుణంగా నిరాశపరచిన విష్ణు..రీసెంట్‌గా జిన్నా చిత్రంతో పలకరించాడు. దీపావళి సందర్భంగా . కార్తీ సర్దార్, విశ్వక్ సేన్ ఓరి దేవుడో, శివ కార్తికేయన్ ప్రిన్స్, కూడా విడుదలయ్యాయి. వీటితో పాటు అంతకు ముందు వారం రిలీజ్ అయిన కాంతారా కూడా ఉంది. అయితే దివాళికి రిలీజ్ అయిన చిత్రాల్లో దాదాపు అన్నింటికి అంతో ఇంతో పాజిటివ్ టాకే రాగా, మంచు విష్ణు జిన్నా మాత్రం దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది.
వారం వ్యవధిలోనే చాలా థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల కనీసం పది మంది కూడా థియేటర్‌కి రాకపోవడంతో షోలని రద్దు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే జిన్నా పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం పది టికెట్లు తెగితే గానీ షోలు వేయమని రద్దు చేస్తున్నారట. జిన్నా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ నడుస్తుంది. ఎవరికి నచ్చిన స్టైల్ లో వారు జిన్నా మూవీకి సంబంధించి మీమ్స్ క్రియేట్ చేస్తే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక జిన్నా సినిమా వారం రోజులలో ఎంత రాబట్టింది అనేది చూస్తే.. Day1 -రూ. 12 లక్షలు, Day2 -రూ. 10 లక్షలు, Day3 -రూ. 8 లక్షలు, Day4 -రూ. 11 లక్షలు, Day5 -రూ.7 లక్షలు, Day6 -రూ. 4 లక్షలు, Day7 -రూ. 2 లక్షలు వసూళ్లు సాధించింది. అతి తక్కువ టార్గెట్‌తో జిన్నా బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఐదు కోట్లు అంటూ మార్క్ పెట్టుకుని జిన్నా అతి తక్కువ థియేటర్లో విడుదలైనట్టు సమాచారాం. బ్రేక్ ఈవెన్ ఈ సినిమా క్రాస్ చేయలేదని విశ్లేషకులు చెబుతున్న మాట.