Venkatesh And Nagarjuna : దూత వెబ్ సిరీస్‌తో మంచి జోష్‌లో ఉన్న యువసామ్రాట్ నాగచైతన్య తాజాగా తన కొత్త చిత్రం తండేల్ మొదలు పెట్టాడు. సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తండేల్ సినిమా ముహూర్తం వేడుక నేడు (డిసెంబర్ 9) గ్రాండ్‍గా జరిగింది. హీరోలు వెంకటేశ్, నాగార్జున ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ అనే బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక ఇప్పుడు తండేల్ అనే ఓ పాన్ ఇండియన్ మూవీ రెడీ కానుంది. తండేల్ ముహూర్తం వేడుకలో కెమెరా స్విచ్ఆన్ చేశారు నాగార్జున. ఫస్ట్ క్లాప్ కొట్టారు వెంకటేశ్. మూవీ స్క్రిప్ట్‌ను దర్శకుడు చందూ మొండేటికి నిర్మాత అల్లు అరవింద్ అందించారు.
తండేల్ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. శ్యామ్‍దత్ సినిమాటోగ్రఫీ చేయనుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. 2018లో గుజరాత్ సమీపంలోని సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 22 మంది శ్రీకాకుళం, విజయనగరం జాలర్లను పాకిస్థాన్ బంధించింది. భారత ప్రభుత్వం వారిని స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపింది. సుమారు రెండున్నరేళ్ల తర్వాత వారిని భారత్‍కు తిరిగి పంపింది పాక్. ఈ యథార్థ ఘటనల ఆధారంగానే తండేల్ రూపొందనుంది. జాలరిగా నాగచైతన్య ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే వచ్చింది.
అయితే లాంచింగ్ వేడుకకి ముందుగా వెంకటేష్ హాజరు కాగా, ఆ తర్వాత నాగార్జున వచ్చారు. అయితే వెంకీని చూడగానే నాగార్జున షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకు పోతుంటే ఆయనని వెనక వీపుపైన అలా కొట్టాడు. బిగ్ బాస్ కి పోయాక మనోడి రేంజ్ చాలా ఎదిగింది అన్నట్టు వెంకీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి సినిమా చేస్తున్నాడు. మరి ఈ చిత్రంతో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…