Vanga Geetha : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఇక పోలింగ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఎవరు అధికారంలోకి వస్తారో ఇప్పుడు చెప్పడం చాలా కష్టంగా మారింది. గతంలో భీమవరం గాజువాకలో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. ఆయన ప్రత్యర్థిగా వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. వంగా గీత అంత సెలబ్రిటీని ఎలా ఎదుర్కొనబోతున్నారు, ఆమె వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
పిఠాపురం కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. ఇక పిఠాపురంలో ఎటు చూసినా సినిమా ఇండస్ట్రీ లేదా బుల్లితెర సెలబ్రిటీలే కనిపిస్తూ పవన్ తరపున ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతున్నట్లు వారు చెబుతున్నారు. ఇదే విషయం గురించి వంగా గీత దగ్గర వన్ ఇండియా ప్రస్తావించగా తనదైన శైలిలో కౌంటిరిచ్చారు. లక్ష ఓట్ల మెజార్టీతో నిజంగానే పవన్ కళ్యాణ్ గెలిచే సత్తా ఉంటే సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు, క్రీడారంగంకు చెందిన వారు ఇక్కడకు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణే ఒక స్టార్‌డమ్ ఉన్న వ్యక్తికి ఈ సో కాల్డ్ ఇండస్ట్రీ సెలబ్రిటీల అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరోలు పిఠాపురంకు క్యూ కట్టడాన్ని వంగా గీత ఏమాత్రం తప్పుపట్టలేదు. ఎవరు ఎవరికోసమైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. అయితే గెలిచిన తర్వాత ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారనే విషయాన్ని ఆలోచన చేసి ఓటు వేయాలని ఆమె వన్‌ఇండియా ద్వారా పిలుపునిచ్చారు. కాకినాడ పిఠాపురం హోటల్స్ అన్నీ పవన్ కోసం ప్రచారం చేసే వారితో నిండిపోయాయని చెప్పిన గీత తన వెనక జగన్ ఉన్నారనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. అంతేకాదు తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా పిఠాపురం అభివృద్ధికి ఎలాంటి పనులు చేశానో ప్రజలకు తెలుసనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…