Unstoppable Show : ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి ఆహా అనే ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షోకి హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ షోకి ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజరు కాగా, ఆ షోలో ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని విషయాలు గురించి తెలుసుకునేందుకు బాలయ్య.. షో మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫోన్ కలిపారు. బాలయ్య అడగ్గానే ఫోన్‌లో రామ్ చరణ్.. ప్రభాస్ గురించి సీక్రెట్స్ చెప్పేసినట్టున్నాడు. దాంతో ప్రభాస్ ‘ఒరేయ్ చరణ్ నువ్వు నా ఫ్రెండా, శత్రువా’ అంటూ కోప్పడటం ప్రొమోలో కనిపించింది.
ఇక తాజాగా విదిలిన ప్రోమోలో లైవ్ కాల్ లో చరణ్ కి ఫోన్ చేసి బాలయ్య సరదాగా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ‘సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డి సినిమానే ముందు చూడాలని, మీ నాన్నగారి వాల్తేరు వీరయ్య సినిమా తన సినిమా తర్వాతే చూడాలని సరదాగా చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ సమయంలోనూ బాలయ్య ఓ ఇద్దరికి కాల్ కలిపాడట. తొలుత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కి ఆ కాల్ కలిపినట్లు టాక్ వినిపించినా.. రామ్ చరణ్, త్రివిక్రమ్‌కి ఫోన్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
![Unstoppable Show : పవన్ కళ్యాణ్ ముందే రామ్ చరణ్‌కి వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ..! Unstoppable Show balakrishna given warning to ram charan](http://3.0.182.119/wp-content/uploads/2022/12/balakrishna-2.jpg)
ఇక ఈ షోలో మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్‌పై వస్తున్న విమర్శల గురించి కూడా ఇద్దరూ చర్చించినట్లు ఆ షోకి హాజరైన అభిమానులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్సనల్, ప్రొఫెషనల్ గోల్స్ గురించి కూడా బాలయ్య ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అంతేకాదు పవన్ కళ్యాణ్ సాయం చేసిన వారిని ఈ షోకి పిలిపించి.. పవర్ స్టార్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారట. ఈ ఎపిసోడ్ సంక్రాంతికి ప్రసారం కానుందని, ఇదే సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ అని అంటున్నారు.