Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు కాగా, ఆయన కెరీర్‌లో 27 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. పలువురు సినీ ప్రముఖలు పవన్ కళ్యాణ్ కి విషెస్ తెలుపుతున్నారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్ అంటూ రీ- ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్న పవన్ త్వరలో హరిహర వీరమల్లు అనే సినిమాతో పాటు తమిళ రీమేక్ చిత్రం, సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో అలరించనున్నాడు.
సినిమాలలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు కురిపించిన వారు లేరు. కాని ఎప్పుడైతే ఆయన రాజకీయాలలోకి వచ్చారో తెగ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ల విషయాన్ని గురించి ప్రస్తావన తెస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల దీనిపై ‘అన్ స్టాపబుల్ 2’ వేదికన మరోసారి పవర్ స్టార్ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు. అయితే తాజాగా ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ మరియు సౌత్ ఏషియా ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు పవన్ కళ్యాణ్ ని ‘డై హార్డ్ ఉమనైజర్’ అంటూ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
![Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఉమనైజరా.. అంత మాట అనేశాడేంటి..? umair sandhu sensational comments on Pawan Kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/03/pawan-kalyan.jpg)
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తావిస్తూ.. అలాగే హీరోయిన్లతోనూ పవన్ కళ్యాణ్ అలా.. అంటూ ఉమైర్ సంధు షాకింగ్ గా ట్వీట్ చేశారు. అతని ట్వీట్‌పై ఘాటు కామెంట్లతో ఉమైర్ తీరును తప్పుబడుతున్నారు. గతంలో ఉమైర్ టాలీవుడ్ స్టార్ హీరోలపై దారుణమైన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచారు. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. . మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.