Udayabhanu Kids : ఒకప్పటి టాప్ యాంకర్స్ లో ఉదయభాను ఒకరు. ఆమె సుమకి కూడా పోటీ ఇచ్చింది. ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది. అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది. ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం బాగా ఫీలవుతోంది. అయితే ఉదయభాను పాపులారిటీతో పాటూ కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తల్లితో గొడవ, తన పర్సనల్ మేనేజర్ విజయ్ నే పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లయిన చాలా ఏళ్ల తరువాత ఉదయభాను తల్లి అయింది. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పట్నించి బుల్లితెరకు, సినిమాలకు దూరంగా ఉంటోంది. రెండేళ్ల నుంచి ఒకట్రెండు సార్లు మినహా.. ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించింది లేదు.
కవల పిల్లలకు తల్లైన ఉదయ భాను ప్రస్తుతం.. వారి ఆలనా..పాలనా చూసుకుంటోంది. అందుకే బుల్లితెరకు దూరంగా ఉంటున్నానంటోంది. తొలిసారిగా తన కవల పిల్లలతో తళుక్కున మెరిసింది ఉదయ భాను. ఇద్దరు పిల్లలనీ చేరొకళ్ళూ ఎత్తుకొని వచ్చిన ఈ జంట వైపే అందరి దృష్టీ మళ్ళింది.నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్న భర్త విజయ్ సహా కవల పిల్లలతో అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఉదయభాను ఇటీవల నారా లోకేష్ యువగళం ఈవెంట్ లో మెరిసింది. అయితే ఈ రోజు ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆమె పిల్లలు జనగణమన జాతీయ గీతాన్ని అద్భుతంగా ఆలపించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
![Udayabhanu Kids : ఉదయ భాను పిల్లలు జనగణమనని ఎంత బాగా పాడారో చూడండి..! Udayabhanu Kids see how they sung janaganamana](http://3.0.182.119/wp-content/uploads/2023/08/udayabhanu-kids.jpg)
ఇక ఇటీవల ఉదయభాను తన హోమ్ టూర్ వీడియో చేసిది. ఈ హోమ్ టూర్ వీడియోలో ఆమె ఇల్లు మొత్తం పాలరాతి భవనంలా ఎంతో విలాసవంతంగా ఉంది.ఇక ఈ హోమ్ టూర్ వీడియోలో తన గెస్ట్ రూమ్, పిల్లల బెడ్ రూమ్, పిల్లలకు ప్రత్యేకంగా స్టడీ రూమ్, హోమ్ థియేటర్, బాల్కనీ, టెర్రస్ మొత్తం చూపించారు.అయితే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉందని కొద్ది రోజులలోనే పూర్తి వీడియోని షేర్ చేస్తా అంటూ ఉదయభాను తన హోమ్ టూర్ వీడియో చేశారు.అయితే ఈ ఇల్లు మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నప్పటికీ చూడటానికి చాలా రిచ్ లుక్ లో ఉందని చెప్పాలి.