Taraka Ratna : నందమూరి ఫ్యామిలీకి చెందిన యువ హీరో నందమూరి తారకరత్న చిన్న వయస్సులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నందమూరి మోహనకృష్ణ- శాంతి దంపతులకు ఫిబ్రవరి 22వ తేదీన ఆయన జన్మించారు. 1983 వ సంవత్సరంలో అంటే సరిగ్గా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి కొద్ది నెలల ముందు ఆయన జన్మించగా, ఫిబ్రవరి 18, 2023న కన్నుమూసారు. తారకరత్న ముందు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా, సినిమాల్లో తగిన గుర్తింపు రాకపోవడంతో రాజకీయాలలో యాక్టివ్ కావాలని భావించాడు.
కొన్ని నెలల క్రితం తారకరత్న గుంటూరులో చేసిన ఒక పర్యటన సూపర్ సక్సెస్ కావడంతో ఆయన గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలకృష్ణ ప్రస్తుతం పోటీ చేస్తున్న హిందూపురం నుంచి లేదా తెలుగుదేశానికి గట్టి పట్టున్న గుడివాడ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో మొదటి రోజు పాల్గొన్న తారకరత్న నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోయారు. ఆ సమయంలో వెంటనే ఆయనను కుప్పంలోనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తరలించేందుకు 45 నిమిషాలు పట్టగా ఆ 45 నిమిషాల పాటు ఆయన గుండె ఆగిపోయింది.
తరువాత వైద్యులు విశ్వ ప్రయత్నం చేయడంతో మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు. అయితే తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిపోయిందని వైద్యులు గుర్తించారు. అలా ఆగిపోవడం వల్ల మెదడులోని కొంత భాగం దెబ్బతిన్నంది.గుండె సహ కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ మెదడులోని కీలకమైన భాగం దెబ్బ తినడంతో తారకరత్న కోలుకోలేకపోయారని తెలుస్తోంది. షుగర్ ఎక్కువగా ఉండడం, ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వారికి కూడా గుండెపోటు రావడం కూడా తారకరత్నకి ఇబ్బందిగా మారింది. సీపీఆర్ అందాల్సిన టైంలో కాకుండా లేటుగా చేయడం వల్లే దానివల్ల హార్ట్ హోల్స్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి.. ఆయన ఆరోగ్యం విషమంగా మారేలా చేసిందని పలువురు వైద్యులు చెప్పుకొస్తున్నారు.