TDP : ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాల్లో బిజీగా మారాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయని కొందరు చెబుతున్నాకూడా దానిపై క్లారిటీ లేదు. అయితే ఎన్నికలు ఎప్పుడైనా అన్ని పార్టీలు గెలుపు ఓటములను లెక్క వేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలగైనా గెలుపొంది.. కచ్చితంగా అధికారంలోకి రావాలని తెలుగు దేశం కష్టపడుతోంది. అందుకోసం ఇప్పటికే చంద్రబాబు నాయుడు జిల్లాల బాట పట్టగా.. లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు.
రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులను, వారి త్యాగాలను వైసీపీ ప్రభుత్వం అవమానిస్తుందని ,. ప్రభుత్వం చేస్తున్న పనులు దారుణమని, వాటికి సమాధానం చెప్పే రోజు వస్తుందన్నాని టీడీపీ, జనసేన నాయకులు తిట్టిపోస్తున్నారు. విద్యుత్తు బిల్లులు, పన్నులు, చలాన్లు, ధరల పెంపుతో ఇస్తున్న దాని కంటే అధికంగా వసూలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు సైతం టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చేది అధికారంలోకి వైసీపీనే. 175కి 175 సీట్లు రావడం గ్యారెంటీ. చంద్రబాబు, జనసేనలు కలసి పోటీ చేసిన ఫలితం శూన్యం అంటున్నారు.
టీడీపీకి కేవలం 4 సీటలు మాత్రమే వస్తాయి. టీడీపీతో కలిస్తే జనసేనకి వచ్చే ఓట్లు కూడా రావు. రాజధాని పేరుతో రైతుల భూములని ఆగం ఆగం చేసారు. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చి చేసేదేం లేదని వైసీపీ కార్యకర్త అన్నారు. టీడీపీకి తిప్పి కొడితే నాలుగు సీట్స్ కన్నా ఎక్కువ రావని ఆయన జోస్యం చెప్పారు. ఏవో తప్పుడు ఆరోపణలు చేస్తూ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాని వైసీపీ అన్ని స్థానాలలో గెలవడం ఖాయం అని అన్నారు. మరి రానున్న రోజులలో పరిస్థితులు ఎంతగా మారి ఎవరికి ఎక్కువ ఫలితం దక్కుతుందనేది చూడాల్సి ఉంది.