Sushant Singh Rajput : మంచి భవిష్యత్ ఉన్న నటుడు సుశాంత్ సింగ్ ఊహించని విధంగా కన్నుమూసాడు. ఆయన ఎలా మృతి చెందాడనే విషయంపై ఇప్పటికీ అందరిలో అనుమానాలు ఉన్నాయి. కొందరు హత్యగావించబడ్డాడడని చెబుతుండగా, మరి కొందరు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. ఈ అనుమానాల నడుమ సుశాంత్ మరణం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ రూప్ కుమార్ షా.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్యే అని తెల్చేశారు. పోలీసులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తమ నివేదికలో పేర్కొన్నారు.
రూప్ కుమార్ షా మాట్లాడుతూ.. సుశాంత్ కుమార్ మరణించిన రోజున పోస్టుమార్టం కోసం కూపర్ ఆసుపత్రికి ఐదు మృతదేహాలు వచ్చాయన్నారు. తాము పోస్టుమార్టం కోసం వెళ్లినప్పుడు ఆ ఐదు మృతదేహాల్లో ఒకటి బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌దని , ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని, మెడపైనా రెండుమూడు ఉన్నట్టు గుర్తించామన్నారు. నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేస్తుండగా వీడియో తీయాల్సి ఉంటుందని అయితే, పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఫొటోలు మాత్రమే తీశామని ఆయన చెప్పుకొచ్చారు.
![Sushant Singh Rajput : సుశాంత్ సింగ్‌ది ముమ్మాటికీ హత్యే.. ఆత్మహత్య కాదన్న డాక్టర్.. Sushant Singh Rajput not suicide he was killed said doctor](http://3.0.182.119/wp-content/uploads/2022/12/sushant-singh-rajput.jpg)
సుశాంత్‌ను చూడగానే ఆయన శరీరంపై ఉన్న గుర్తులను బట్టి అది హత్యేనని సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినట్టు రూప్ కుమార్ షా తెలియజేశారు. నిబంధనల మేరకు పోస్టుమార్టం పూర్తి చేయాలి కదా అని అడిగితే, ఫొటోలు మాత్రమే తీయాలని, వీలైనంత త్వరగా మృతదేహాన్ని అప్పగించాలని సీనియర్లు ఆదేశించారని , అంతేకాక రాత్రి సమయంలో పోస్టుమార్టం చేయాల్సి వచ్చిందన్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదని పోస్టుమార్టం అటెండెంట్ వెల్లడించడానికి ముందే.. బీజేపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వ్యవహారంలో ఆదిత్య థాకరే పాత్ర ఏంటో చెప్పాలని లోక్‌సభలో మహారాష్ట్ర ఎంపీ రాహుల్ షేవాలే ప్రశ్నలు కూడా కురిపించారు. ఏదేమైన సుశాంత్ సింగ్ సూసైడ్ ఎఫెక్ట్..ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీని వెంటాడుతుందనే చెప్పాలి.