Super Star Krishna : తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు. డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మాన్ గా కృష్ణ గారిని అందరూ మెచ్చుకుంటారు. ఆయన గట్స్ కి, మొండితనానికి, అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు లాంటి ఆయన మనస్తత్వనికి ఎంతోమంది ఫిదా అయ్యారు. కేవలం సినిమాలనే కాకుండా ఆయన మనస్తత్వాన్ని బట్టి కూడా చాలామంది అభిమానులు అయ్యారు. అయితే కృష్ణ గారు తన జీవితంలో 4 తప్పులను చేశారని అంటూ ఉంటారు.
అందులో మొదటిది హీరోయిన్ కావాలనుకున్న తన కూతురిని ఆపడం. నిజానికి మంజుల హీరోయిన్ అవుతానంటే కృష్ణ నో చెప్పలేదు. కానీ సూపర్ స్టార్ అభిమానులు మాత్రం మంజుల హీరోయిన్ గా చేయకూడదని రచ్చ చేశారు. దాంతో కృష్ణ వెనక్కితగ్గాల్సి వచ్చింది. కృష్ణ ఎస్పీ బాలసుబ్రమణ్యంతో వ్యవహరించిన తీరు కూడా చాలామందికి నచ్చలేదు. చెప్పుడు మాటలు వినడం వల్లే బాలసుబ్రమణ్యంతో వైరం ఏర్పడిందని చెబుతుంటారు. మూడో మిస్టేక్ ఏంటంటే.. దర్శకుడు రేలంగి నరసింహారావుతో హీరో శోభన్ బాబుతో సంసారం అనే సినిమా తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో రేలంగి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని కృష్ణ చెప్పాడు.
కానీ ఈ సినిమా విషయంలోనూ రేలంగి తప్పులేకున్నా కృష్ణ ఆయనపై ఫైర్ అయ్యారట. ఇదిలా ఉండగా నిర్మాత రామానాయుడు కృష్ణ శోభన్ బాబు హీరోలుగా ముందడుగు సినిమా చేశారు. ఆ తరవాత కృష్ణతో మరో సినిమా చేయాలని రామానాయుడు కోరారట. దాంతో కృష్ణ దర్శకుడిగా రాఘవేంద్రరావు ఉండాలని.. రచయితలుగా పరిచూరి బ్రదర్స్ ఉండాలని కండిషన్స్ పెట్టారు. అయినప్పటికీ రామానాయుడు ఓకే చెప్పి వారిని సెట్ చేశారట. కానీ కృష్ణ తాను వేరే నిర్మాతతో కమిట్ అయ్యానని కావాలంటే ఇద్దరి భాగస్వామ్యంలో చేస్తానని చెప్పారట. దాంతో రామానాయుడు హర్ట్ అయ్యి ఆ సినిమాను పక్కన పెట్టేసి వెంకటేష్ ను హీరోగా పరిచయం చేశారట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…