SS Rajamouli Net Worth : దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. అపజయం అంటూ ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న తాను తీసిన ప్రతి సినిమాతో తన రికార్డులను తానే కొల్లగొడుతాడు. ఆయన రికార్డులను కొల్లగొట్టడం అంటే ఎవరికీ సాధ్యం కాదు. అందుకే తన పాత సినిమాల రికార్డులను తానే తిరగరాస్తుంటాడు. ఆయన సినిమా విడుదలవుతుందంటే సినీ ప్రపంచం మొత్తం అటే చూస్తుంది. రాజమౌళిది పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. వారి తాత అయిన అప్పారావు అంటే అప్పట్లో పెద్ద జమిందారి. ఆయనకు ఐదుగురు కొడుకులు ఉండగా, అందులో విజయేంద్ర ప్రసాద్ ఒక్కరు.
వారికి దాదాపు 600 ఎకరాల ఆస్తి ఉండేదంట. అప్పట్లోనే వారు అప్పారావు పేరు మీద కెమికల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేశారంటే.. ఎంత సంపన్నులో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి తాత అప్పారావు చనిపోయిన తర్వాత.. కొడుకులెవరికీ ఆయన ఆస్తుల గురించి తెలియదంట. అందరూ చదువుకోవడంలో బిజీగా ఉండటంతో ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా పెద్దగా తెలియక చాలా వరకు పోగొట్టుకున్నారని రాజమౌళి తల్లి రాజనందిని స్నేహితురాలు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే రాజమౌళి తన ఆస్తిని పోగొట్టుకున్న కూడా ఇప్పుడు దానికి పదింతలు సంపాదిస్తున్నాడు.
రాజమౌళి హీరోలకి ధీటుగా రెమ్యూనరేషన్ అందుకుంటాడే టాక్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆయన తారక్, చరణ్ లు కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటూ అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేసాయి. అయితే, రీసెంట్ గా రాజమౌళి సంబంధించిన ఆస్తుల లెక్కలు సినీ వర్గాలను షాక్ కి గురి చేస్తున్నాయి. సినిమా కి భారీ స్దాయిలో రెమ్యూనరేషన్ అందుకునే రాజమౌళి పేరిట 148 కోట్లు ఆస్తులు ఉన్నాయని. ఆయన ఎలా లేదన్న సినిమా 60 నుండి 70 కోట్లకు పైగానే పారితోషకం పుచ్చుకుంటాడు అన్న టాక్ ఉంది. గత మూడేళ్ళలలో ఆయన ఆస్తులు 40% పెరిగాయట.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అత్యాధునికమైన సౌకర్యాలతో 2008లో ఓ ఇల్లును కొనుగులు చేసిన రాజమౌళి. .పలు రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా కూడా కూడబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన దగ్గర రేంజ్ రోవర్, బీఎం డబ్ల్యూ కార్లు ఉన్నాయి. ఒక్కో కారు ధర కోటి నుండి 1.5 కోట్ల వరకు ఉంటుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…