Sri Reddy : సంచలనాలకు మారు పేరుగా నిలుస్తున్న శ్రీరెడ్డి ఇటీవలి కాలంలో యూట్యూబ్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబ్ లో శ్రీరెడ్డి వెరైటీ వంటకాలు చేస్తూ నోరూరించేలా చేస్తుంది. శ్రీరెడ్డి వంటకాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తాజాగా శ్రీరెడ్డి నల్ల కోడి కూర వండింది. ఇందులో చింతకాయలు వేసుకొని తింటే ఆ రుచి వేరే లెవల్‌లో ఉంటుందని చెప్పింది. ఒకవైపు అందాల సోయగం చూపిస్తూ మరోవైపు బూతుల పంచాంగం విప్పుతూ శ్రీరెడ్డి సందడి చేస్తుంది. శ్రీరెడ్డి తాజా వంటకానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
తెలుగులో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో ఇండస్ట్రీలో పాపులర్ అయిన శ్రీరెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురుదృష్టవశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోవడంతో కాస్టింగ్ కౌచ్ అంటూ రచ్చ చేసింది. అప్పట్లో నటి శ్రీ రెడ్డి ఏకంగా రోడ్లపై అర్థ నగ్న ప్రదర్శనలు కూడా చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పాపులర్ అయిపోయింది..
అయితే ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్‌బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడూ శ్రీరెడ్డి తన ఫాలోవర్స్‌కి నీతి సూత్రాలు కూడా చెబుతూ ఉంటుంది. ప్రేమలు దోమలు అంటూ తిరగొద్దని, ఆడపిల్లలు పద్దతిగా ఉండాలని, పలు సూచనలు కూడా చేస్తుంటుది. ఏదేమైనా శ్రీరెడ్డి యూట్యూబ్‌తో సంచలనంగా మారతుండగా, దీని ద్వారా నెలకు 6 నుండి 7 లక్షలు సంపాదిస్తుందని అంటున్నారు.