Sreeleela : శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్ హాట్ ఫేవరేట్ అని చెప్పాలి. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడిని తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్..పవన్..విజయ్ దేవరకొండ ఇలా టాప్ లీగ్ హీరోలు అందరితో సినిమాలు చేస్తోంది. బాలకృష్ణ సినిమాలో ఓ కీలకపాత్ర చేస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ సినిమాలో అమ్మడి కట్టు బొట్టు చూసి మేకర్స్ వరుస అవకాశాలు ఇస్తున్నారు. రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న శ్రీలీల.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో నటిస్తూ ఈ సినిమాతో కూడా మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటుంది.
ప్రస్తుతం గోల్డెన్ భామగా మారిన శ్రీలీల దర్శక ధీరడు రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రంలో కీ రోల్ లో కనిపించనున్నదంటు న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో హీరోయిన్గా నటించబోతుంది. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలోను హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ పై అఫీషియల్ గా ప్రకటన అయితే ప్రస్తుతం రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీ లీల దశ తిరిగిందని చెప్పాలి ఖచ్చితంగా వరుస ఆఫర్లతో జోరు మీదున్న శ్రీ లీలకు ఇది ఓ జాక్పాట్ అనే చెప్పాలి.
శ్రీలీల లక్ ఇటీవల మాములుగా లేదు. ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయ్యే స్థాయికి ఎదుగుతోంది శ్రీలీల. అరవిరిసిన అందమైన పువ్వులా కళ్లను కట్టిపడేస్తోంది శ్రీలీల. చూపు తిప్పుకోని అందంతో కట్టి పడేస్తున్న ఈ ముద్దుగుమ్మని చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వడమే కాకుండా తమ సినిమాలలో ఛాన్స్లు ఇస్తున్నారు. రానున్నరోజులలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…