Sreeleela : అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో మంచి హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు అదే జోష్‌తో అనీల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. భగవంత్ కేసరి అనే టైటిల్‌తో ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. తమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 30న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టైటిల్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
భగవంత్ కేసరి మూ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిత్రానికి సంబంధించి ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు అనిల్ టీమ్. ఈక్రమంలోనే గతంలో ఈ సినిమా సెట్‌లో అనీల్ రావిపూడి ఫైట్ మాస్టర్‌లతో కలిసి బాలయ్య సాంగ్‌కు స్టెప్పులేశాడు. అప్పుడు అది తెగ వైరల్ అయింది… ఇప్పుడు మరోసారి ఈ సెట్ లో బాలయ్య సాంగ్‌కి అద్భుతమైన డాన్స్ పార్ఫామెన్స్ లతో దడదడలాడింది. ఈసినిమాలో నటిస్తున్న తారలు.. కాజల్ అగర్వాల్, శ్రీలీల నరసింహ నాయుడు సినిమాలోని చిలకపచ్చ కోక పాటకు ఊరమాస్ స్టెప్పులేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
కథానాయికలు ఇద్దరూ పింక్ షర్టులు, బ్లూ జీన్స్ ధరించి డ్యాన్స్ లు చేయగా, ఈ వీడియో నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనిపై అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ”నేను వేసిన డ్యాన్స్ కు జెలస్ గా ఫీలై.. మా హీరోయిన్స్ ఇద్దరూ నాముందు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు” అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై బాలయ్య ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైన కూడా చిత్రానికి సంబంధించి అనీల్ రావిపూడి విచిత్రంగా చేస్తున్న ఈ ప్రమోషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.