Sreeja Kalyan Dhev : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తొలుత శిరీష్ భరద్వాజ్ అనే ఒకరిని ప్రేమించి వివాహమాడగా, అనూహ్య పరిస్థితులలో వీరు విడిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మరోసారి రెండో పెళ్లి వాడైన కళ్యాణ్ దేవ్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇతనికి మెగా కుటుంబం సపోర్ట్ ఉండటంతో విజేత అనే సినిమాతో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా హిట్ కాకపోయినా నటుడిగా కళ్యాణ్ దేవ్ కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
అయితే ఎప్పుడు మెగా ఫ్యామిలీలో కనిపంచే కళ్యాణ్ దేవ్ ఇటీవలి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. కిన్నెరసాని వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా నేరుగా జీ 5 ద్వారా విడుదలైంది, ఇక సూపర్ మచ్చీ సినిమా థియేటర్స్ లో విడుదలై ఈ సినిమా నుండి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో కూడా ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకోకపోవడం ఒకరిని ఒకరు ఫాలో కాక పోవడంతో వీరి మధ్య ఏదో జరిగిందని విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది.
తాజాగా కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వైరల్అవుతోంది. ఆ పోస్ట్‌లో ఓపికగా ఉండండి.. అన్నిటికి సమాధానం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇది ఏ ఉద్దేశంతో పెట్టారనే విషయంపై మెగా అభిమానులు చర్చ జరుపుతున్నారు.. విడాకుల గురించే ఈ పోస్ట్ పెట్టారంటూ కొందరు అంటుంటే.. అసలు విషయం త్వరలో చెపుతారేమో అని మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. కాగా, శ్రీజ తన పెద్ద కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఇటీవల నిర్వహించగా అందులో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. గత పుట్టినరోజుకి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపిన కళ్యాణ్ దేవ్ ఈ ఏడాది మాత్రం విషెస్ తెలపకపోవడంతో ఈ అనుమానాలు రెట్టింపు అయ్యాయి. వీరిద్దర విడిపోయారనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తుంది.