Shoaib Akhtar : పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ తన పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. ఎన్నో మంచి విజయాలు పాక్‌కి అందించిన షోయబ్ అక్తర్ రిటైర్మెంట్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. ముఖ్యంగా భారత్ గెలుపు ఓటములపై ఆయన చేసే కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంటాయి. వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓడినప్పుడు షోయబ్ మాట్లాడుతూ.. భారత జట్టు అదృష్టంతో ఫైనల్ చేరలేదు. అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరుకున్నారు. కానీ ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ మాత్రం నన్ను పూర్తిగా నిరాశ పరిచింది. భారత్ ఈ మ్యాచ్ కోసం మెరుగైన పిచ్ రెడీ చేయాల్సింది’ అని అక్తర్ చెప్పాడు.
‘అలాగే బ్యాటింగ్లో కూడా టీమిండియా చాలా మెత్తబడిపోయి ఆడింది. అలా కాకుండా ఎప్పట్లా ఎటాకింగ్ ఆట ఆడాల్సింది. పిచ్ నుంచి మరికొంత పేస్, బౌన్స్ లభిస్తే.. అసలు టాస్ పెద్దగా ప్రభావమే చూపించేది కాదు. దురదృష్టం ఏంటంటే.. భారత్ ఎప్పుడూ ఇలాంటి పెద్ద మ్యాచుల్లో తడబడుతుంది.’ అని అక్తర్ పేర్కొన్నాడు.ఇక ఇప్పుడు భారత యువ క్రికెటర్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు షోయబ్. వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ 20 ఎంత రసవత్తరంగా సాగుతుందో మనం చూశాం. ఆస్ట్రేలియా తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్‌లో భాగంగా నాలుగో టి20లో నెగ్గిన భారత్ ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
అయితే ఆసీస్‌కి మూడు చెరువుల నీళ్లు తాగించిన యువ భారత్ క్రికెటర్స్‌పై షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, సూర్య కుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నారని, వారి అద్భుతమైన ఆటతీరుతో మంచి విజయాలు సాధించారు అని కూడా తెలియజేశారు.. పిల్లగాళ్లే మనపై ఏం గెలుస్తారు అని అనుకునే వారికి మంచి బుద్ధి చెప్పారు అంటూ షోయబ్ కామెంట్స్ చేశారు. అందరు సమిష్టిగా అద్భుతంగా ఆడుతున్నారని, అందరికి మంచి భవిష్యత్ ఉందని షోయబ్ అన్నాడు. వీళ్లని పిల్లలు అనుకుంటే తప్పు, చిచ్చరపిడుగులు అని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియజేశాడు షోయబ్.