ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్‌లో కొన్ని జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఏ జట్లు సెమీస్‌కి చేరతాయి, ఏ జట్లు ఇంటికి వెళతాయి అనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియాను ఎలాగైనా సెమీఫైనల్‌కు చేర్చాలని ఐసీసీ చూస్తోందంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అనడం సంచలనం రేపుతోంది. ఈ మ్యాచ్‌లో అంత భారీ వర్షం పడినా మ్యాచ్‌ను త్వరగా ప్రారంభించడం, విరాట్ కోహ్లి ఓ నోబాల్ విషయంలో అంపైర్లపై ఒత్తిడి తీసుకు రావడం, ఆ తర్వాత కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ వీడియో బయటకు రావడంలాంటివి ఈ మ్యాచ్‌ను వివాదంలోకి నెట్టేశాయి.
బంగ్లాతో మ్యాచ్ ముగిశాక సామా టీవీతో అఫ్రిది ఓ డిస్కషన్‌లో పాల్గొన్నాడు. నిజానికి ఆ చర్చంతా దీని చుట్టే తిరిగింది. ఆ టీవీ యాంకర్ పదే పదే ఇండియాను ఫైనల్ చేర్చడానికి ఐసీసీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించాడు. ఈ చర్చలో పాల్గొన్న మరో జర్నలిస్ట్ కూడా ఐసీసీ.. ఇండియా వైపు మొగ్గినట్లు కనిపిస్తోందని అనడం విశేషం. కాగా, “షకీబుల్ హసన్ కూడా ఇదే విషయం చెప్పాడు. దానిని స్క్రీన్‌పై కూడా చూపించారు. గ్రౌండ్ కూడా చాలా తడిగా ఉంది. కానీ ఐసీసీ కూడా కాస్త ఇండియా వైపు మొగ్గినట్లు నాకు అనిపిస్తోంది. ఇండియాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీస్ చేర్చాలని చూస్తున్నట్లుగా ఉంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో అంపైర్లు కూడా ఇలాగే వ్యవహరించారు. వాళ్లకు బెస్ట్ అంపైర్ అవార్డులు వస్తాయని ప్రపంచానికి కూడా తెలుసు” అని సదరు జర్నలిస్ట్ అన్నాడు.
దీనిపై స్పందించిన ఆఫ్రిది.. . “ఏం జరిగిందో నాకు తెలుసు. చాలా వర్షం పడిన తర్వాత మ్యాచ్ వెంటనే ప్రారంభమైంది. ఐసీసీ, ఇండియా ఆడుతోంది, ఇందులో చాలా విషయాల జోక్యం ఉంది. అయితే లిటన్ దాస్ బ్యాటింగ్ మాత్రం అద్భుతం. అతడు పాజిటివ్ క్రికెట్ ఆడాడు. ఆరు ఓవర్ల తర్వాత మరో రెండు మూడు ఓవర్లు ఆట ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో గెలిచే స్థితికి వచ్చేది. మొత్తానికి ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చూపిన పోరాటం మెచ్చుకోదగినది..’ అని వ్యాఖ్యానించాడు ఆఫ్రిది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…