ఒకప్పుడు సీనియర్ హీరోల అందరితో ఆడిపాడిన అందాల ముద్దుగుమ్మ రంభ. మెగాస్టార్ చిరంజీవితో ‘బావగారూ బాగున్నారా?’, నట సింహం బాలకృష్ణతో ‘భైరవ ద్వీపం’, కింగ్ నాగార్జునతో ‘హలో బ్రదర్’, విక్టరీ వెంకటేష్ తో ‘ముద్దుల ప్రియుడు’, జేడీ చక్రవర్తితో ‘బొంబాయి ప్రియుడు వంటి సినిమాలలో నటించి టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత కెనడాలో ఉంటున్న రంభ ఈ రోజు తన పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
తన సోషల్ మీడియాలో యాక్సిడెంట్ పిక్స్ షేర్ చేస్తూ.. దేవుడి దయ వల్ల ఈ ప్రమాదంలో మేం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డామన్నారు. మేం అందరం సురక్షితంగా ఉన్నామన్నారు. కాకపోతే తన చిన్నారి సాషా దేవుడి ఇంకా ఆసుపత్రిలోనే ఉందన్నారు. దయచేసి మా కోసం దేవుడిని ప్రార్థించండి అంటూ రంభ పేర్కొన్నారు. చిన్నారి సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానుల్ని ఆమె కోరారు. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం అని రంభ తన పోస్టులో వెల్లడించారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న కోలీవుడ్ సెలెబ్రిటీలు రంభ ఫ్యామిలీని అండగా నిలబడుతూ భరోసా ఇస్తున్నారు.
ఇక ఇంద్రకుమార్‌ను రంభ పెళ్లి చేసుకోగా, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రంభ స్వస్థలం విజయవాడ. ఆమె ఇవీవీ సత్యనారాయణ సినిమా ఆ ఒక్కటి అడక్కుతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. రంభ ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం తన భర్త నుండి విడాకులు తీసుకునేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్దమైంది. కాని పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ భర్తతో కలిసి ఉంటుంది.ఇటీవల చెన్నై వచ్చినప్పుడు తన పాత ఫ్రెండ్స్ ని కలిసి సరదాగా ఎంజాయ్ చేసింది.