విభిన్నమైన పాత్రలతో సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత. దశాబ్దకాలం నుండి ఇండస్ట్రీ ని ఏలుతున్న సమంత ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెల్సిందే..ఈ సినిమా తర్వాత ఆమె ‘శాకుంతలం’ అనే భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది..గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా విడుదలైంది..ఈ ట్రైలర్ కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసారు.
శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుండగా, ఈ సినిమాలో శకుంతల – దుశ్యంతుడు మధ్య జరిగిన అన్ని విషయాలను ఈ సినిమాలో జనాలకు కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. అయితే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కాలం తర్వాత ఆమె మీడియా ముందుకు రావడం కొందరు ఆమె అందం గురించి చర్చలు జరుపుతున్నారు. సమంతకు మయోసిటిస్ వ్యాధి రావడం చాలా బాధాకరం..సమంత పూర్తి స్థాయి లో కోలుకొని మునుపటిలాగ అందం మరియు అభినయం తో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నాను అంటూ ఫేస్ బుక్ లో ఒక ప్రముఖ పేజ్ వేసిన పోస్ట్ కి సమంత స్పందించింది.
నాకు ఎదురైనని సవాళ్లు ఎవరికీ పగవాడికి కూడా రాకూడదని ప్రార్థిస్తున్నాను..నాలాగా నెలల తరబడి హాస్పిటల్ బెడ్ కి పరిమితమై ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఎవరికీ రాకూడదు..దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.. మీ గ్లో పెరగాలని నేను కూడా కోరుకుంటున్నాను’ అని రిప్లయ్ ఇచ్చింది సమంత . ఇక ఇటీవల శాకుంతలం ట్రైలర్ సమంత గురించి గుణశేఖర్ పాజిటివ్‌గా గొప్పగా మాట్లాడడంతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘శాకుంతలం’ సినిమాకు నిజమైన హీరో సమంతే అని గుణశేఖర్ అన్నప్పుడు శామ్ ఎమోషనల్ అయ్యారు. మయోసైటిస్ వ్యాధి ఉందని ప్రకటించాక సమంత మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. తన గత సినిమా ‘యశోద’ ప్రమోషన్లలో కూడా సమంత పాల్గొనలేకపోయారు.