Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల ముడుపులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని.. చంద్రబాబు మౌనంగా ఉంటే నిజం, అబద్ధం అయిపోదన్నారు. రెండు కంపెనీల నుంచి 118 కోట్లు ముడుపులు తీసుకుంటే.. ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం నిజంకాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ విషయంలో లీగల్‌గానో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో ఉన్న కోణాన్ని తేల్చాలని డిమాండ్ చేసారు. తక్షణమే ఈ విషయంలో లీగల్‌గానో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో ఉన్న కోణాన్ని తేల్చాలని కోరారు.
గతంలోనూ రాజకీయం అడ్డుపెట్టుకొని స్టేలు తెచ్చుకున్నాడని.. హవాలా సొమ్మును షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలిస్తుంటే.. ఈడీ మౌనంగా ఎందుకు ఉంటుందో అర్థంకావడం లేదన్నారాయన. చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాలన్న సజ్జల.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లీగల్‌గా ప్రయత్నిస్తామన్నారు. 2016-19 వరకూ ఎల్ అండ్ టీ, షాపోజీ పల్లంజీ కంపెనీలకు తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎవరికైతే కాంట్రాక్టులు ఇచ్చాడో వాళ్ల నుంచి షెల్ కంపెనీల పేరుతో ముడుపులు తీసుకున్నట్లు తేలిందన్నారు.
అందులో రూ.118 కోట్ల లంచం డబ్బులు మనోజ్ వాసుదేవ్ పార్ధసాని అనే వ్యక్తికి చెందిన సూట్ కేసు కంపెనీ వద్ద నుంచి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యవహారం అంతా నడుపారని తేలిందని సజ్జల వివరించారు.ద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్ సెక్రటరీగా పని చేసిన శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బు తీసుకున్నట్లు ఒక జాతీయ పత్రికలో పెద్ద వార్త ప్రచురితం అయ్యిందని గుర్తు చేసారు. ఇది కేవలం ఒక వ్యక్తి వచ్చిన లంచం మాత్రమేనని రాశారని వివరించారు. మనోజ్ వాసుదేవ్ పార్ధసానీ తాను చంద్రబాబును కలిశానని, పీఏ లెక్కలు చూసుకోండి అని బాబు చెప్పినట్లు చెప్పారని చెప్పుకొచ్చారు.