Sajjala Ramakrishna Reddy : ఏపీలో రాజకీయం ఇప్పుడు చాలా వాడి వేడిగా సాగుతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపు వివాదాల రచ్చ సాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు క్షేత్రస్ధాయిలో బీఎల్వోలు, ఈఆర్వోలపై ఒత్తిడి తెచ్చి తమ ఓట్లను తొలగిస్తున్నారంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదే అంశంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈసీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారని చంద్రబాబు అంటుంటే, వైసీపీ ఓట్లపై రాద్ధాంతం చేస్తున్నారంటూ సజ్జల రామృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. పోటా పోటీగా ఇరు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు పరుగలు పెడుతున్నాయి. ఉరవకొండలో దొంగ ఓట్ల రద్దు విషయంలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడటంతో ఈ వ్యవహారం హైలైట్ గా మారింది.
దీన్ని మరికాస్త సాగదీసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారని, ఇదెక్కడి ఘోరమని అంటున్నారు సజ్జల. ఈసీకి తాము కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. దొంగ ఓట్ల అసలు దొంగ చంద్రబాబు అంటూ కౌంటర్ ఇచ్చారు. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ సపోర్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు బండి సంజయ్ కూడా తోడయ్యారు. వారి పార్టీ కూడా అలా చేస్తారో మనకు తెలియదు అని సజ్జల అన్నారు.
రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వాటిని ఈసీ తొలగిస్తే ప్రజాతీర్పు కచ్చితంగా వస్తుందని భావిస్తున్నట్లు సజ్జల తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల బయటబడిన దొంగఓట్ల వ్యవహారాల్ని సజ్జల గుర్తుచేశారు. కుప్పంలోనే 30 వేల దొంగఓట్లు బయటపడ్డాయన్నారు. దీంతో టీడీపీకి భయం పట్టుకుందన్నారు. టీడీపీ గతంలో అక్రమంగా తీసేయించిన ఓట్లను తాము తిరిగి చేర్పిస్తున్నట్లు సజ్జల వెల్లడించారు. ఉరవకొండలో ఓట్లను అక్రమంగా తొలగించలేదని, కేవలం తొలగింపులో ప్రొసీజర్ పాటించకపోవడం వల్లే అధికారులు సస్పెండ్ అయ్యారన్నారు. తంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ ఓట్లను ఎలా తొలగించారో సజ్జల చెప్పుకొచ్చారు. ప్రభుత్వ డేటాను బ్లూఫ్రాగ్ అనే సంస్ధకు ఇచ్చారని, ఐటీ గ్రిడ్స్ అనే మరో సంస్ధను కూడా ఏర్పాటు చేసి దీనికి అనుబంధంగా టీడీపీ సేవా మిత్ర యాప్ తెచ్చారన్నారు.