Kodali Nani : యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న విమర్శలపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని లోకేష్‌తో పాటు చంద్రబాబుపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నీ తండ్రి అయితే గుడివాడలో పోటీ చేయాలని, గన్నవరంలో నువ్వు పోటీ చేయాలని లోకేష్ కు కొడాలి నాని ఇవాళ సవాల్ విసిరారు. తల్లిని అవమానించినందుకు ప్రతికారంగా, లోకేష్ వచ్చి తన మూత్రం తీసుకువెళతాడంట అంటూ ఎద్దేవా చేశారు. నన్ను వంశీని లేపేయడమంటే కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకోవడం కాదు. డైపర్ వేసుకొని కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్.. నన్ను డ్రాయర్‌పై నిలబెడతాడా?.
తాత, మామ, పెళ్ళాలు పేర్లు చెప్పుకొని తిరిగే తండ్రీ కొడుకులు, మా సంగతి తెలుస్తారా. పాదయాత్ర ఇచ్చాపురం వచ్చేసరికి డైపర్ కూడా ఉడ కొట్టి, ప్రజలు తన్నే తన్నుకి కర్ణాటకలోనో, తమిళనాడులోని లోకేష్ పడతాడు. తమ పేర్లు రాసుకున్న ఎర్ర బుక్కులోని పేపర్లను.. ఎన్నికల అనంతరం తుప్పు నాయుడు, పప్పు నాయుడు వేరే దానికి ఉపయోగిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పప్పు నాయుడు చేసింది కమ్మగలం పాదయాత్రే. కమ్మ దేవుడు చంద్రబాబు, యువరాజు లోకేష్ కోసం అర్ధరాత్రి వరకు రోడ్లపై తిరిగారు. దమ్ముంటే లుచ్చా గాడు, బచ్చాగాడు గుడివాడ, గన్నవరం వచ్చి పోటీ చేయాలి.” అని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఆయన మిత్రుడు గన్నవరం ఎమ్మెల్యే వంశీపైనా తీవ్ర విమర్శలు చేశారు కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరినీ ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరికలు చేశారు. లోకేష్ విమర్శలకు ప్రతిగా తనపై చంద్రబాబు, వంశీపై లోకేష్ పోటీ చేయాలని సవాల్ చేశారు. ఏదేమైన ఏపీ రాజకీయాలు రాను రాను చాలా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తున్నారు.