Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 90 దశకం వరకు పలు గ్రామాల్లో ఉన్న మూఢనమ్మకాలు, చేతబడి లాంటి వ్యవహారాలపై ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ దండు విజువల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తేజు సరసన సంయుక్త మీనన్ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ విరూపాక్ష చిత్రానికి జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తేజు బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.
అయితే తేజూ విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను, పలు ఇంటర్వ్యూలలో కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ వచ్చాడు. తాజాగా ఇంటర్వ్యూలో తేజు తాను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే స్పందించి సకాలంలో తాను ఆసుపత్రిలో చేరేలా సహాయపడ్డ వ్యక్తిని గుర్తు చేసుకున్నాడు. అతడి పేరు సయ్యద్ అబ్దుల్ కాగా, . తాను పూర్తిగా కోలుకున్న తర్వాత సయ్యద్ ని గుర్తించి కలిసినట్లు తేజు తెలిపాడు. గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి చేర్చిన అబ్దుల్ చేసిన సహాయాన్ని ఈ జీవితంలో మరచిపోలేను అని సాయిధరమ్ అన్నాడు. అతనికి కేవలం డబ్బు ఇచ్చో.. థ్యాంక్స్ చెప్పో అతడు చేసిన సహాయానికి ఋణం తీర్చుకోలేను. అందుకే అతడిని ఫోన్ నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరం అయినా వెనుకాడకుండా ఫోన్ చేయమని చెప్పాను అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
![Sai Dharam Tej : యాక్సిడెంట్ నుంచి కాపాడిన వ్యక్తికి సాయిధరమ్ తేజ్ చేసిన హెల్ప్ ఇదే..! Sai Dharam Tej what he did for the man he got help from](http://3.0.182.119/wp-content/uploads/2023/04/sai-dharam-tej-1.jpg)
తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అతడికి డబ్బు ఇచ్చారేమో తనకు తెలియదు అని తేజు తెలిపాడు. 2021 సెప్టెంబర్ 10న సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ తేజు ఈ ప్రమాదానికి గురి కాగా, కొద్ది రోజుల పాటు కోమాలో ఉన్నాడు. ఆయనని బ్రతికించడం కోసం ఫ్యామిలీ ఎంతో కృషి చేసింది.. అభిమానులు కూడా ఎన్నో ప్రార్ధనలు చేశారు. ఇక కోలుకున్న తర్వాత తేజు తిరిగి అదే ఎనెర్జీతో సినిమాలు చేస్తుండడం మెగా ఫ్యాన్స్ ఫుల్ సంతోషిస్తున్నారు.