Sai Dharam Tej : మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాడు. మరో మూడు వారాల్లో ఆయన నటించిన సినిమా విడుదలకి సిద్ధం కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌ల జోరు పెంచింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాయిధరమ్ యాక్సిడెంట్ తర్వాత తనకు ఎదురైన పరిణామాల గురించి అభిమానులతో పంచుకున్నాడు. యాక్సిడెంట్ అయినప్పుడు షాక్‌కు గురయ్యానని, దాంతో తన మాట పడిపోయిందని సాయిధరమ్ చెప్పుకొచ్చాడు.
ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకోవడానికి తనకు ఆరు నెలల సమయం పట్టింది అని సాయి ధరమ్ అన్నాడు. అయితే ఆ సమయంలో సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే… నీ పనైపోయిందా? రిటైర్మెంట్ తీసుకున్నావా? అంటూ జోక్స్ వేశారు. నాకు చాలా బాధేసింది. నేనేమీ కావాలని విరామం తీసుకోలేదు కదా. ప్రమాదం వలన గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ప్రమాదం కారణంగా నాకు మాట పడిపోయింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే నా నోటి నుండి మాటలు రావడం కష్టమైంది. మాట్లాడడంలో కొద్దిగా ఇబ్బందిగా ఫీలైతే నేను మందు తాగి వచ్చానా అని అనే వారు.
![Sai Dharam Tej : బైక్ ప్రమాదంపై తొలిసారి ఓపెన్ అయిన సాయిధరమ్ తేజ్.. ఏమన్నాడంటే..? Sai Dharam Tej finally responded on his accident incident](http://3.0.182.119/wp-content/uploads/2023/04/sai-dharam-tej.jpg)
ఆ సమయంలో నాకు మాట విలువ తెలిసొచ్చింది. రిపబ్లిక్ మూవీలో నాలుగు పేజీల డైలాగ్ చెప్పిన నేను రెండు మాటలు మాట్లాడటానికి ఎంతోఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో సన్నిహితులు మద్దతుగా నిలిచారు. మాట సమస్యను అధిగమించాను… అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. సాయిధరమ్ ఏడాది కిందట బైక్ ప్రమాదానికి గురయ్యాడు. చాలా రోజుల వరకు హాస్పిటల్, బెడ్‌కే పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన నటించిన విరూపాక్ష ఏప్రిల్ 21న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.