RRR : తెలుగోడు మీసం మెలేసేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తమ నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల మనసులు గెలుచుకుంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ పాట ఆస్కార్ బరిలో నిలిచి 95 వ అంతర్జాతీయ వేడుకలలో ఆస్కార్ అవార్డును అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం అని చెప్పాలి.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ నటించి మెప్పించారు. థియేటర్‌తో పాటు ఓటీటీలోను ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం సినిమాను నిశితంగా పరిశీలించి కొన్ని మిస్టేక్ లను నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ మూవీలో మల్లిని తీసుకువచ్చే సమయంలో ఎన్టీఆర్ బోనులో పులులు, జింకలు తీసుకెళ్లడం మనం గమనిస్తాం.
అయితే ఆ సమయంలోనే ఓకే బోనులో పులులు మరియు జింకలు తీసుకెళ్లడం ఏంటని చాలామంది ట్రోల్ చేస్తుండగా, నెటిజన్స్ మరో మిస్టేక్ పట్టేశారు.సినిమాలో రాహుల్ రామకృష్ణ, రామ్ చరణ్ ను మొదటి సారి చూసినప్పుడు పెయింటింగ్ వేస్తూ కనిపిస్తారు. రామ్ చరణ్ ను చూడగానే రాహుల్ పారిపోతారు.
అయితే ఎన్టీఆర్ స్నేహితుడిగా చరణ్ వచ్చినప్పుడు రాహుల్ రామకృష్ణ అతని భుజంపైన చెయ్యి వేయగా, ఆ సమయంలో రాహుల్ వేళ్ళకు ఎలాంటి రంగు కనిపించదు. కానీ ఎన్టీఆర్ బొలీవియా వెళుతున్న వాహనంపై రామ్ చరణ్ అదే రంగులో ఉన్న డిజైన్ చూడగా వెంటనే రాహుల్ రామకృష్ణ చేతి గోళ్లకు ఉన్నటువంటి రంగుని గుర్తు చేసుకుంటాడు. ఈ మిస్టేక్ గమనించిన నెటిజన్లు రాజమౌళిని విమర్శిస్తున్నారు.