Robo Movie : సినిమా ప్రపంచం గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తేనే సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా చేయాలి అంటే దానికి ఒక కథ కావాలి.కథకు తగ్గట్టు పాత్రలు కావాలి.పాత్రకు తగ్గట్టు నటీనటులు కూడా కావాలి.అలా ఒక్క సినిమా చేయాలి అంటే ప్రతి ఒక్క చిన్న దానిని పెద్దగా చూడాలి.నిజానికి సినిమా తీయడం అంత సులువైన పనేమి కాదు.దర్శకుడు కథను తెరపై చూపించాలి అంటే కేవలం తనకు నచ్చినట్లు కాకుండానే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వారికి నచ్చినట్లుగా తీయాల్సిన పరిస్థతి ఉంది. సినిమా అంటేనే ట్విస్టులతో కూడినది.అలాంటిది ట్విస్టులు ముందే పెట్టేస్తే ప్రేక్షకులకు సినిమా చూడటానికి ఏ మాత్రం ఆసక్తి చూపించరు.
డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రోబో. ఈ సినిమా 2010 అక్టోబరు 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లో భారీ వసూలుతో సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసింది.ఇంత పెద్ద విజయంతో ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కగా ఎందుకో సీక్వెల్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో చిట్టి సన ను కోరుకుంటాడు.కానీ సన మాత్రం వసీ ని ఇష్టపడుతుంది.దాంతో చిట్టి సనాను దక్కించుకోవడం కోసం వసీ కి ఎన్నో నష్టాలు తెచ్చి పెట్టడం చూశాం..దీంతో వసీ కి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి.
అయితే తొలి పార్ట్‌లో చిట్టి ఓ చిన్నారిని కాపాడే సీన్ మనం చూశాం. ఈ సీన్ కోసం బ్యాక్ గ్రౌండ్లో టీం చాలా కష్టపడ్డారు. కొందరు వ్యక్తులు గ్రీన్ బ్లూ కలర్ దుస్తులు ధరించడం అలానే కొందరు రిమోట్‌తో ఆపరేట్ చేస్తూ ఉండడం బీటీఎస్ వీడియోలో కనిపిస్తుంది. ఇక రజనీకాంత్ ముందు రోబో డ్యాన్స్ చేయడం మనం చూశాం. ఇది చైన్నైలోని వీఎఫ్ ఎక్స్ స్టూడియోలో చేశారు. స్టూడియో మొత్తం బ్లూ కలర్‌గా మార్చి అందులో ట్రాకింగ్ పాయింట్స్ సెన్సార్స్ ఉంచారు. ఆర్టిస్ట్ ట్రాకింగ్ సూట్ వేసుకొని ఉండడం మనం గమనించవచ్చు. అతను యాక్షన్ చేసినప్పుడు దానిని క్యాప్చర్ చేసి రోబో డ్యాన్స్ చేసినట్టు చూపించారు. ఇక రజనీకాంత్‌లా కనిపించే రోబో కోసం ఓ సిలికాన్ మాస్క్ తయారు చేసారు. ఇక చిన్నారిని కాపాడే సీన్ ఒక మెకానికల్ రోబోతో చేశారు. రోబోని క్రేన్‌తో అటాచ్ చేసి స్లైడ్ చేశారు. ఇలా సినిమా కోసం చాలానే పని చేసింది చిత్ర బృందం.