RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఇక ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లోకి రానుండగా, గత కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో రీసెంట్‌గా విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్ లో వైసీపీ మంత్రి రోజాతో పాటు పలువరు ఏపీ మంత్రులు పాల్గొన్నారు. మంత్రి రోజా ఈ ఈవెంట్లో వ్యూహం సినిమా గురించి సీఎం జగన్మోహనరెడ్డి గురించి, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రతిబింబిస్తూ ఆర్జీవీ ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆర్జీవీ అంటేనే ఒక సెన్సేషన్. వ్యూహం సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే, సైకిల్ పార్టీ షేకయిపోయింది. వర్మ గారు డైరెక్టర్ అని తెలియగానే పచ్చ సైకోలకు తడిసిపోయింది. ఎప్పుడైతో వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబుకు చెమటలు పట్టాయి. ట్రైలర్‌తో లోకేష్ పరుగులు పెట్టాడు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు, జగన్ అన్నపడిన సంఘర్షణకు రూపమే వ్యూహం సినిమా అని తెలుస్తుంది” అని మంత్రి రోజా తెలిపారు.”గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలాగే ఈ వ్యూహం సినిమాతో రాజకీయ నాయకుడిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఈ తరంతో పాటు వచ్చే తరానికీ కూడా తెలుస్తాయి” అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు.
అయితే రోజా మాట్లాడుతున్నంత సేపు రామ్ గోపాల్ వర్మ కింద కూర్చొని ఆమె అలా చూస్తుండిపోయారు. అంతేకాదు రోజా మాటలకి తన్మయత్వం చెందిన వర్మ లోలోపల ఫుల్ ఖుష్ అయ్యాడు. రోజాని చూస్తూ ఆయన ఇచ్చిన రియాక్షన్ మాత్రం స్పెషల్‌గా మారింది. ఈ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. చంద్రబాబును నేను గుర్తించింది ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినపుడు మాత్రమేనని తెలిపాడు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇపుడు ఆయనే గొప్ప అని చెప్పటానికి కారణం ఆయన ఫ్యాన్స్ కోసమేనని చెప్పుకువచ్చాడు. చంద్రబాబు, లోకేష్ నిత్యం చేసేది జగన్ ను తిట్టడమేనని వెల్లడించాడు. అలాంటి లోకేష్ తమని తిడుతున్నామని పిటిషన్ వేయటం జోక్ అని వెల్లడించాడు.