మొబైల్స్ తయారీ సంస్థ రియల్‌మి.. కొత్తగా వాచ్ 3 పేరిట ఓ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీంట్లో 1.8 ఇంచుల కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తున్నారు. అలాగే ఎస్‌పీవో 2, హార్ట్ రేట్, స్ట్రెస్, స్లీప్ క్వాలిటీలను కొలిచేందుకు ప్రత్యేకంగా ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా దీనికి లభిస్తోంది. ఈ వాచ్‌లో 340 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.
ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైస్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు గాను రియల్‌మి లింక్ యాప్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయాలి. తరువాత బ్లూటూత్ ద్వారా వాచ్ ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ ద్వారానే వాచ్‌కు ఉండే స్పీకర్ ఫోన్, మైక్రోఫోన్‌ల ద్వారా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే నాయిస్ కాన్సిలేషన్ ఫీచర్‌ను కూడా కాల్స్ కు అందిస్తున్నారు.
ఈ వాచ్ 110కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఔట్ డోర్ వాకింగ్, ఇండోర్ వాకింగ్, ఔట్ డోర్ రన్నింగ్, ఇన్‌డోర్ రన్నింగ్, డైనమిక్ సైక్లింగ్, హైకింగ్, క్రికెట్, యోగా, రోయింగ్, బాస్కెట్ బాల్ వంటి స్పోర్ట్స్ మోడ్స్‌ను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఫిట్ నెస్‌ను సులభంగా కొలవవచ్చు. అలాగే 24 గంటల రియల్ టైమ్ హార్ట్ రేట్ సెన్సార్‌తోపాటు లో హార్ట్ రేట్ రిమైండర్, బ్లడ్ ఆక్సిజన్ మీజర్‌మెంట్, స్లీప్ డిటెక్షన్, స్టెప్స్, క్యాలరీస్, డిస్టాన్స్, వాటర్ రిమైండర్, సెడెంటరీ రిమైండర్, యాక్టివిటీ రికార్డ్స్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఈ వాచ్‌లో అందిస్తున్నారు.
ఇక మ్యూజిక్ కంట్రోల్, వెదర్ ఫోర్‌కాస్ట్, ఆటోమేటిక్ మోషన్ రికగ్నిషన్, కాల్ నోటిఫికేషన్, మెసేజ్ రిమైండర్, అలారం రిమైండర్ వంటి అనేక ఫీచర్లు ఈ వాచ్‌లో లభిస్తున్నాయి. ఇక దీని ధర రూ.3499 ఉండగా.. లాంచింగ్ కింద రూ.2,999 ధరకే దీన్ని అందిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ వాచ్‌ను విక్రయించనున్నారు.