Rashmika Mandanna : చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల ముద్దుగుమ్మ రష్మిక. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన రష్మిక ఆ తర్వాత కెరీర్‌లో దూసుకుపోతోంది. ఒకవైపు దక్షిణాదిలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం హీందీలో మూడు సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటించగా, ఈ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది.
అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిస్టర్ మజ్ను, రణబీర్ కపూర్ జోడీగా యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. గుడ్ బై చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక చెప్పే మాటలతోపాటు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. పొట్టి పొట్టి దుస్తులలో ఈ అమ్మడు చేసే రచ్చ పీక్స్ లో ఉంటోంది. ఇది చూసి అవాక్కవుతున్నారు. ఇక తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్ చూసి తాను ఎలా బాధపడతానో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది రష్మిక. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఎవరు తెలియదు. గైడెన్స్ ఇచ్చే వాళ్లు లేరు. ఎవరితో కూడా పెద్దగా మాట్లాడేదాన్ని కాదు.
![Rashmika Mandanna : సమాజం నుండి రష్మికని వెలేశారా.. ఈ అమ్మడి మాటలకు అందరికీ మైండ్ బ్లాక్.. Rashmika Mandanna told interesting details about her career beginning](http://3.0.182.119/wp-content/uploads/2022/10/rashmika-mandanna.jpg)
నాపై కొందరు చేసిన ట్రోల్స్ కు ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. నాకు శత్రువులు ఉండకూడదని అనుకుంటాను. నా ఫోకస్ అంతా నేను ఏం కావాలనుకుంటున్నాను అనేదానిపైన పెడతాను. ఇప్పుడు నన్ను దారుణంగా ట్రోల్ చేసే వారిని పట్టించుకోవట్లేదు. కానీ కెరియర్ కొత్తలో నన్ను ట్రోల్ చేసిన మీమ్స్ రాత్రి కలలో వచ్చేవి. నన్ను వేడుకుంటున్నట్టు, సమాజం నుండి వెలివేసినట్టు కలలు వచ్చేవి. ఆ టైంలో ఉలిక్కిపడి నేను లేచి, ఏడ్చే దానిని అంటూ రష్మిక గత అనుభవాలు చెప్పుకొచ్చింది. ఇది విన్న ప్రతి ఒక్కరూ రష్మిక మీద సింపథీ చూపిస్తున్నారు.