Ram Gopal Varma : జనసేనాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నాయకులు వరుస విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ని విమర్శించే నేపథ్యంలో జగన్ ముఖ్యంగా ఆయన పెళ్లిళ్లపై వరుస విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లబ్దిదారులకు సీఎం జగన్ గురువారం నాడు ఇళ్లను అందించారు.లబ్దిదారులతో కలిసి సామూహిక గృహా ప్రవేశాలను చేయించారు జగన్. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ… చంద్రబాబు దత్తపుత్రుడి స్టోరీ మీకు తెలిసిందేనంటూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని సీఎం జగన్ విమర్శలు చేశారు.
ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ పవన్ కళ్యాణ్ భార్యల గురించి ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇది దత్తపుత్రుడికి మహిళలపై ఉన్న గౌరవమని సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.వివాహ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ గౌరవం లేదన్నారు. ప్యాకేజీ స్టార్ కు గాజువాక, భీమవరంతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు సీఎం జగన్. సరుకులను అమ్ముకొనే వాళ్లను చూశాం.. కానీ స్వంత పార్టీని అమ్ముకొనే వాళ్లను ఇప్పుడే చూస్తున్నామని పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు చేశారు సీఎం జగన్.అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకొనేందుకే ప్యాకేజీ స్టార్ పర్యటనలు చేస్తున్నారని పవన్ పై జగన్ ఆరోపణలు చేశారు.
సొంత పార్టీని, స్వంత వర్గాన్ని అమ్ముకొనే వ్యాపారి అని పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌పై జగన్ చేసిన కామెంట్స్‌ని కొందరు ఖండిస్తుండగా మరి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు తెలియదు. అయితే లోకల్, నేషన్, ఇంటర్నేషనల్ అయితే కరెక్ట్ కదా.. మిగతా కంటెక్ట్స్ తెలియదు కాని, ఆయన చేసుకున్న వారిలో తెలుగు అమ్మాయి, హిందీ అమ్మాయి, వేరే దేశానికి చెందిన అమ్మాయి ఉంది కదా అని వర్మ అన్నారు. ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి.