Ram Gopal Varma : కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఒక విషయంపై స్టిక్ అయ్యారంటే తెగే వరకు దానిని లాగుతూనే ఉంటారు. ఎవరు ఎన్ని బూతులు తిట్టినా పట్టించుకోరు. ‘అంతా నా ఇష్టం’ అంటూ తనకు తోచింది తాను చేసుకుంటూ పోతారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి విషయంలోనూ రాంగోపాల్ వర్మ అదే పని చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. అంబర్ పేట్‌లో చిన్నారిపై జరిగిన కుక్కల దాడి తర్వాత వర్మ మేయర్‌పై రెచ్చిపోయారు. ఆమెపై సంచలన కామెంట్స్ చేయడమే కాకుండా కుక్కల మేయర్’ అంటూ సొంత వాయిస్ తో ఆర్జీవీ సాంగ్ పాడారు. తానే స్వయంగా లిరిక్స్ రాయడంతో పాటు.. సొంతంగా పాడారు కూడా..
‘అడుక్కున్న పన్నులు అన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు.. మీ ఇంటిలోకి వందల కుక్కులు వదిలితే మీ పరిస్థితి. అప్పుడు కానీ నొప్పి తెలియదు మీ కుక్క బ్రెయిన్ కు. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవదిరి మేయర్.. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవరిది మేయర్.. ఆ తల్లిదండ్రుల గుండెలు వెక్కి వెక్కి ఏడుస్తుంటే కొద్దిగా అయిన బాధ ఉందా మీకు.. అంటూ సాంతం మేయర్ ను పాట రూపంలో కడిగిపారేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ పాట ఆ సమయంలో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక తాజాగా వర్మ వీడియోను ట్వీట్ చేసి దానికి గద్వాల విజయలక్ష్మిని ట్యాగ్ చేశారు.

స్కూటర్‌పై ఇద్దరు మహిళలు, ఒక బాలుడు వెళ్తుండగా వారిని వీధి కుక్కలు వెంబడించాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆగి ఉన్న కారును స్కూటర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో మహిళలు, బాలుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోను వర్మ ట్వీట్ చేసి మేయర్‌ను ట్యాగ్ చేస్తూ.. ఆమెని టార్చర్ పెడతున్నాడు. నిజానికి ఇది ఒడిశాలోని మెర్హంపూర్ పట్టణంలో జరగగా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా ఈ వీడియో ట్వీట్ చేసింది.అయితే దీనిని వర్మ ట్వీట్ చేస్తూ.. ‘గౌరవ గద్వాల విజయలక్ష్మి దయచేసి ఇది చూడండి’ అని వర్మ పేర్కొన్నారు. అంతేకాదు, వర్మ ట్వీట్ చేసిన వీడియోపై ‘గాంధీ నగర్ 7వ లైన్’ అని రాసి ఉంది. అంటే, ఇది కచ్చితంగా ఎడిట్ చేసిన వీడియో. అందుకే, నెటిజన్లు కూడా వర్మ మీద ఫైర్ అవుతున్నారు.