Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇప్పుడు అంతా హ్యాపీ మూమెంట్స్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు గ్లోబల్ ఇమేజ్ దక్కడం అలానే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ దక్కడం రామ్ చరణ్‌కి ఎంతో ఆనందం కలిగించింది. ఇక త్వరలో రామ్ చరణ్ తండ్రి కూడా కాబోతున్నాడు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు చెర్రీ. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా నుండి రామ్ చరణ్ 3 నెలలు షూటింగ్ ల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. పుట్టబోయే బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . తన సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ తో ఉన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. ఉపాసన ప్రగ్నెన్సీ అప్పటి నుండి రామ్ చరణ్ ఇతర పనులతో బిజీ బిజీగా ఉన్నాడు. అందుకోసం ఉపాసన డెలివరీ టైమ్ లో చరణ్ పక్కనే ఉండాలని షూటింగ్ లకు మూడు నెలలు గ్యాప్ ఇచ్చాడు. ఏ భార్య అయిన తన డెలివరీ టైమ్ లో ఎవరు పక్కన ఉన్నా.. లేకున్నా భర్త ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఉపాసన కోసం, పుట్టబోయే బిడ్డకోసం రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
![Ram Charan : పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం..! Ram Charan and upasana took important decision](http://3.0.182.119/wp-content/uploads/2023/04/ram-charan-upasana.jpg)
ఇక చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే ఇంత ప్రేమ చూపిస్తున్న చెర్రీపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ పేరు హాలీవుడ్ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. దాంతో త్వరలోనే చెర్రీ హాలీవుడ్ ఎంట్రీ ఖాయం అంటూ హింట్స్ కూడా వచ్చాయి. గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్ రామ్ చరణ్ హాలీవుడ్ సినిమాలో నటిస్తే మెగా అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.