Rakul Preet Singh : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ 1990 అక్టోబర్ 10న పంజాబీ ఫ్యామిలీలో జన్మిచింది. న్యూ ఢిల్లీకి చెందిన కుల్విందర్ సింగ్ – రాజేందర్ కౌర్ దంపతులకు జన్మించింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్. దీంతో రకుల్ చదువు కూడా ఆర్మీ స్కూల్ లోనే జరిగింది. ఆమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. రీసెంట్గా రకుల్ 33వ బర్త్ డే వేడుక జరుపుకుంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నారు.
‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ .. రకుల్ కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపింది. రకుల్, ప్రగ్యా కలిసి ఉన్న కొన్ని ఫొటోలను పంచుకుంది. క్యూట్ ఫొటోల్లో బర్త్ డే గర్ల్ బ్యూటీఫుల్ గా మెరిసింది. ఆ ఫొటోలు నెటిజన్లనూ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను పంచుకుంటూ.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు రకుత్ ప్రీత్ సింగ్. నీలాంటి వారు ఎవరూ లేరు. సంతోషంగా, మరింత సానుకూలమైన శక్తిని కలిగి ఉండటం నీలో ఉత్తమమైనది. మరింత ప్రేమ, అదృష్టం, ఆనందంతో పాటు నీవు కోరుకున్న ప్రతితి దక్కాలని కోరుకుంటున్నాను.’ అంటూ స్పెషల్ గా విష్ చేసింది.
రకుల్ ప్రీత్ తాజాగా తన అభిమానులతో కలిసి బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. నేటి బర్త్ డే సందర్భంగా నెట్టింట్లో రకుల్ ఫ్యాన్స్ సందడి చేశారు. ఇలా ముంబైలోని బాంద్రా ఏరియాలో రకుల్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. అనంతరం అభిమానులు, మీడియాతో కలిసి బర్త్ డేను రకుల్ సెలెబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు బాలీవుడ్ సందడి చేసింది. గతేడాది వరుస చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ పెద్దగా హిట్ పడలేదు. ఇదిలా ఉంటే.. మళ్లీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది రకుల్. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, శివకార్తికేయన్ ‘ఆయలాన్’ చిత్రాల్లో నటిస్తోంది.