Rahul Dravid : ప్రస్తుతం భారత్ వేదికగా వరల్డ్ కప్ జోరుగా సాగుతుంది. ఇప్పటి వరకు భారత్ వరల్డ్ కప్‌లో భాగంగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడలేదు. రేపు భారత్ తో డైరెక్ట్‌గా తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే వరల్డ్ కప్ టోర్నీకి ముందు ప్రతి ప్లేయర్‌కూ గేమ్ టైం దొరికిందని, ఈ విషయంలో మాత్రం తను చాలా హ్యాపీ అని అన్నాడు రాహుల్ ద్రవిడ్. జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లకు గేమ్ టైం దొరికిందని, ఇది చాలా కీలకమైన అంశమని ద్రావిడ్ చెప్పాడు. వరల్డ్ కప్ ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచుల్లో మొత్తం 15 మంది పాల్గొంటారన్న ఈ లెజెండ్.. దీని వల్ల ప్రాక్టీస్ గేమ్స్‌లో అంత ఇంటెన్సిటీ ఉండదని అభిప్రాయపడ్డాడు.
అయితే మ్యాచ్ కి కొద్ది రోజుల ముందు శుభ్‌మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయనకు డెంగ్యూ జ్వరం వచ్చందనే వార్త వైరల్ గా మారడంతో అభిమానులు మరియు క్రికెట్ ను ఎంతగానో ఆరాదించే ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తరపున ఆడనున్న గిల్ కు డెంగ్యూ ఫీవర్ అని మొదటి మ్యాచ్ ను ఆస్ట్రేలియా తో ఆడడం కుదిరేలా లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. మీరందరూ అనుకుంటున్నట్లు గిల్ కు డెంగ్యూ ఫీవర్ రావడం నిజమే,.. కానీ మరీ అంత బలహీనంగా ఏమీ లేడు అని.. ఈ రోజు కొంచెం హెల్తీ గా ఉన్నట్లు ప్రకటించారు.
ఆదివారం జరగనున్న మొదటి మ్యాచ్ కు గిల్ ఇంకా దూరం కాలేదు అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేయగా.. మ్యాచ్ సమయానికి గిల్ ఏ విధంగా ఉన్నాడన్న దానిపైనే మ్యాచ్ కు తీసుకోవాలా వద్ద అన్నది నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక గిల్ ఆడని పక్షంలో అతని స్థానంలో శిఖర్ ధావన్‌ని ఓపెనర్‌గా పంపిస్తాం. లేదంటే రాహుల్‌ని ఓపెనర్‌గా పంపి సూర్య కుమార్ యాదవ్‌ని మిడిల్ ఆర్డర్‌లో పంపిస్తాం. దీంతో మా మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్‌గా ఉంటుందని స్పష్టం చేశాడు ద్రవిడ్.