Sreeja Konidela : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలలోకి రాకపోయిన మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన పరిణామాలు, కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఫేమస్ అయిన ఈ భామ మొదటి పెళ్లి విషయంలో మెగా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకు వచ్చినట్టు చేసింది. మీడియా ముఖంగా శ్రీజ మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ తన గన్నుని వదిలేస్తున్నట్టుగా మీడియా ముందే చెప్పడం.. చిరు సైతం మీడియా వేదికగా తన కూతురిని ఆశీర్వదించడం అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజ్‌తో కొన్నేళ్ల కాపురం, ఆ తరువాత నివృతి జన్మించడం, కొన్ని రోజులకే విడాకులు కావడం, మళ్లీ చిరు చెంతకు చేరడం.. ఆ తరువాత కొన్ని రోజులకు కళ్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి జరగడం, నవిష్క జన్మించడం అందరికీ తెలిసిందే.
అయితే కళ్యాణ్ దేవ్‌తో మంచిగా ఉంటుందని అందరు భావిస్తున్న క్రమంలో ఏం జరిగిందో ఏమో గానీ.. ఇప్పుడు ఆ రెండో పెళ్లి కూడా పెటాకులైంది. శ్రీజ, కళ్యాణ్‌లు దూరంగానే ఉంటున్నారు. అధికారంగా విడిపోయినట్టుగా ప్రకటించలేదు గానీ వేర్వేరుగానే ఉంటున్నారు. నవిష్క తన తండ్రికి దూరంగా ఉంటుండగా, నవిష్కను వారానికి ఒకసారి కళ్యాణ్ వద్దకు పంపిస్తుంటుంది శ్రీజ. అలా వారంలో ఒకరోజు తన కూతురిని చూసుకుని కళ్యాణ్ దేవ్ మురిసిపోతోంటాడు. శ్రీజ మాత్రం ఇప్పుడు వెకేషన్లు అంటూ తిరుగుతోంది. తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటోంది.
శ్రీజ కొన్నాళ్లుగా తన ఇద్దరు కూతుర్లతో కలిసి మళ్ళీ చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో జిమ్ ట్రైనర్ టెక్నిక్స్ చెప్తుంటే శ్రీజ తెగ వర్కౌట్లు చేస్తూ కష్టపడి పోతుంది. జిమ్ ట్రైనర్ మినాష్ గాబ్రియల్- శ్రీజ కలిసి చేసిన ఓ వర్కౌట్ తో వీడియో ఎండ్ అయింది.శ్రీజ ఈ వర్కౌట్లు చేసేందుకు బాగా కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అరిచేతుల మీద పైకి కిందకు లెగుస్తూ వర్కౌట్ కోసం చెమటలు కక్కుతోంది. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు అయితే మొగుడిని వదిలేసి ఇలాంటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ఎందుకు పాపులారిటీ పెంచుకుంటున్నావు అంటూ ఆమెని దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.