Radhika Sarathkumar : ఇండియన్ సినిమాలో తమకంటూ ఒక పేజీని లిఖించుకున్న తారల్లో రాధికా శరత్‌కుమార్ ఒకరు. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన రాధికకు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, పెద్దలందరితో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, రాధిక మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. అయితే, నందమూరి బాలకృష్ణకు సైతం రాధిక చాలా క్లోజ్.
ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా అన్‌స్టాపబుల్ షోలో వెల్లడించారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 నాలుగో ఎపిసోడ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అతిథులుగా వచ్చారు. వారితో ముచ్చటించి.. వేదికపై క్రికెట్ ఆడుతున్న క్రమంలో రాధిక సడెన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరవాత ముగ్గురునూ కూర్చోబెట్టి ప్రశ్నలు వేశారు బాలయ్య. ఈ క్రమంలో రాధికతో కలిసి నటించిన స్టార్ హీరోలపై ఆమె అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ కాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి.. వీళ్లందరితో చేశావుగా.. నాలాంటి సూపర్ స్టార్‌తో నీకు ఛాన్స్ రాలేదు అని సరదాగా పంచ్ వేశారు బాలయ్య. ఇక ఆఖరిగా రాధికను ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేశారు బాలకృష్ణ. చిరంజీవిలో నీకు నచ్చనిదేంటి.. నాలో నీకు నచ్చినదేంటి అని అడిగారు. దీనికి రాధిక సమాధానంగా.. చిరంజీవితో ఎప్పుడూ గొడవే. నీతో అలాంటి ఫైట్లు ఏమీ ఉండవు. ఏంటో తెలీదు కానీ.. ఏంటే నువ్వు ఎక్కువగా మాట్లాడతావు అంటారు చిరంజీవి. నువ్వు మాత్రం ఏంటి అని నేను అంటాను. మా ఇద్దరి మధ్య కొంత వాదన జరుగుతుంది. సరదా ఉండదు. మధ్యలో ఆయన భార్య సురేఖ ఒక అంపైర్ అని రాధిక చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…