Prema : అలనాటి హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పేరుకు కన్నడ హీరోయిన్ అయినా కూడా.. తెలుగు సినిమాలలో నటించి ఇక్కడి ప్రేక్షకులు ఎంతగానో అలరించింది. ఆవిడ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ప్రేమ కొంతకాలంఆగా వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీల్లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి మెప్పించారు ప్రేమ. చాలా రోజుల తర్వాత ప్రేమ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేసింది.
ప్రేమ… తన జీవితం.. ప్రేమ, పెళ్లి, ఫిల్మ్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రెండో పెళ్లికి సంబంధించిన వార్తలని ఖండించింది. తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోతే తెలుగు చిత్రపరిశ్రమలో అంతపెద్ద నటిని కాలేకపోయాను అని అన్నారు. ఈ క్రమంలోనే తన సహనటి దివంగత హీరోయిన్ సౌందర్య మరణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది ప్రేమ. “సౌందర్య చనిపోయిన రోజు.. నాకు జవితం ఇంతేనా అనిపించింది. ఇంటికి వెళ్లగానే ఎదురుగా ఆమె బ్రదర్.. సౌందర్య ఫోటోస్ పెట్టి ఉన్నాయి. చూడగానే ఏదోలా అనిపించింది. వాళ్ల బాడీలను బాక్స్ లో పెట్టి ఉంచారు. చూడటానికి కూడా ఫేస్ లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది.

మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ. హార్డ్ వర్క్ తప్ప ఏమీ లేదు. ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడని సౌందర్య అమ్మగారు ఆరోజు ఏంతో ఏడ్చారు. సౌందర్యతో నటించే రోజులు చాలా బాగుండేవి. తను చాలా తక్కువ తినేది. పప్పు, పాలక్, నెయ్యి, గోంగూర పచ్చడి. అవన్నీ తినడం ఆమె దగ్గరే నేర్చుకున్నారు. నేను అయితే షాట్ ఎప్పుడూ అయిపోతుందా అని వెయిట్ చేసేదాన్ని.. కానీ సౌందర్య మాత్రం ప్రతి షాట్ లో అందంగా కనిపించాలని అనుకునేది. ఎప్పటికప్పుడు మరింత అందంగా కనపడేలా చూసుకోవడం చేసేది. తనతో పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి. సౌందర్య మరణించిన సమయంలో ఆమెకు తల లేదు. కేవలం ఆమె పెట్టుకున్న వాచ్ ని చూసి సౌందర్య డెడ్ బాడీ అని గుర్తించారని… ప్రేమ చెప్పుకొచ్చారు.