Prabhu Deva : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడుగా ప్రభుదేవా తెలుగు, తమిళ ప్రేక్షకులని అలరించారు. ఇటీవల ప్రభుదేవా సినిమాలతో కాకుండా వేరే విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రభుదేవా తన మాజీ భార్య రమాలతతో ముగ్గురు కుమారులకు తండ్రి అయ్యాడు. అయితే, వారి కుమారుడు 2008లో మరణించాడు. ప్రభుదేవా 2011లో రమాలతతో విడాకులు తీసుకున్న తర్వాత నయనతారతో కొంతకాలం ప్రేమాయణం సాగించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ వారు విడిపోయారు. అటు పిమ్మట ప్రభుదేవా ముంబై ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్ను ప్రేమించి 2020లో వివాహం చేసుకున్నాడు. హిమానీ ఇటీవల ఒక కుమార్తె జన్మించింది.
గత కొద్ది రోజులుగా ప్రభుదేవా మరోసారి తండ్రి అయ్యాడు అని ప్రచారం జరుగుతుండగా, అవును, ఇది నిజం. ఈ వయసులో నేను మరోసారి తండ్రిని అయ్యాను. చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన వ్యక్తిని అయిన ఫీలింగ్ కలుగుతోంది” అని ప్రభు దేవా చెప్పారు. ప్రభు దేవా కుటుంబంలో తొలి పాప కావడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడు పాప పుట్టడంతో ఇక తన జీవితంలో చాలా సమయం ఆమెతోనే గడుపుతానని అతడు చెప్పాడు. తనపై ఉన్న పనిభారాన్ని తగ్గించుకున్నట్లు కూడా తెలిపాడు.
ఫ్యామిలీ, కూతురుతో కలిసి ఎక్కువ సమయంలో గడపాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లూ అటూఇటూ పరుగెత్తడమే సరిపోయిందని, ఇక పనికి బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడుపుతానని చెప్పాడు. ప్రభు దేవా రెండో భార్య హిమానీ సింగ్.. ఓ ఫిజియో థెరపిస్ట్. ఆమెను 2020లో కొవిడ్ సమయంలో ప్రైవేట్ సెర్మనీలో పెళ్లి చేసుకున్నాడు. తన వెన్ను నొప్పికి చికిత్స కోసం ఆమె దగ్గరకు వెళ్లిన ప్రభు దేవా.. హిమానీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే వీళ్లిద్దరూ కలిసి జంటగా కనిపించారు. తాజాగా వీరిద్దరు తిరములలో ప్రత్యక్షం అయ్యారు. ప్రభుదేవాతో పాటు ఆయన భార్య, తండ్రి కూడా క్యూ లైన్లో ఉండి మరి స్వామి వారిని దర్శించుకున్నారు.