Prabhas Shirt Price : వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షోకి హాజరయ్యాడు. ఎప్పటి నుండో దీనికి సంబంధించి ప్రచారాలు సాగుతుండగా, దీనిపై రీసెంట్గా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాజా ఎపిసోడ్ కోసం ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడైన మరో హీరో గోపీచంద్ కూడా అన్‌స్టాపబుల్ వేదికపైకి వచ్చి సందడి చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఫినిష్ కావడంతో ఆహా టీమ్ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ వదిలింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ షోలో ఇది 6వ ఎపిసోడ్ కానుంది. షోలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అతడి స్నేహితుడు గోపీచంద్ ఎలాంటి విషయాలు పంచుకున్నారు? ఈ ఎపిసోడ్ తో అయినా ప్రభాస్ పెళ్లిపై ఓ క్లారిటీ వస్తుందా అనే దానిపై అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య షో కోసం ప్రభాస్ కలర్ ఫుల్ చెక్ షర్ట్, జీన్స్ లో ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు ఆయన వేసుకున్న షర్ట్‌పై అందరి దృష్టి పడింది. అది ఏ బ్రాండ్, ధర ఎంత అనే వివరాలు కూడా రాబట్టేశారు. ప్రభాస్ వేసుకున్న షర్ట్ వివరాల్లోకి వెళ్తే.. ‘పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్’’.. దీని ధర 115 పౌండ్స్. అంటే.. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 11,618. ప్రభాస్ రేంజ్‌కి ఈ రేంజ్ మెయింటైన్ చేయాల్సిందేనని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ షోకి వచ్చి బాలయ్యతో ముచ్చటించారు. ఇక పోయిన వారం డిసెంబరు 2న ప్రసారం కాబోతున్న ఎపిసోడ్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు.. వచ్చి ప్రేక్షకులను అల్లరింప చేసి తమ పర్సనల్ విషయాల్ని కూడా షేర్ చేసుకుంటూ కనిపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు ప్రభాస్.. మారుతీ దర్శకత్వంలో మరో సినిమాలో భాగమవుతున్నారు.