Pothina Mahesh : జనసేన నుంచి విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడిన పోతిన మహేష్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అధికార వైఎస్సార్‌సీపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. ర్యాలీగా పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద జగన్ బస చేసిన సైట్ వద్దకు వచ్చిన పోతిన మహేష్ తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఆయన ఇప్పుడు నాగబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగబాబు ఇటీవల ఇన్‌డైరెక్ట్‌గా అల్లు అర్జున్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేయగా, అది ఎంత పెద్ద చర్చనీయాంశం అయిందో మనం చూశాం. చివరికి నా ట్వీట్‌ని డిలీట్ చేశాను అంటూ నాగబాబు తెలిపారు.
అల్లు అర్జున్ వైఖరిని తప్పు పడుతూ పోలింగ్ ముగిసిన రోజున జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనం. దానిపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. ఈ ట్వీట్ నాగబాబును విమర్శలకు కేంద్రబిందువుగా మార్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుప్పలు తెప్పలుగా నాగబాబుకు రిప్లైలు పెట్టారు. దీనితో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. అయినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, జనసేన మాజీ నాయకులు నాగబాబును వదలట్లేదు. తాజాగా పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు సహాయం చేసిన వారి పట్ల ఏ మాత్రం కృతజ్ఞత మెగా కుటుంబానికి లేదని పోతిన మహేష్ ఆరోపించారు. తన మామయ్య నాగబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదనే ఉద్దేశంతో అల్లు అర్జున్ తన నా పేరు సూర్య సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా పెట్టించారని, సినిమా పూర్తికాకముందే మూడు కోట్ల రూపాయలను ఇప్పించారని గుర్తు చేశారు.
దీనితో పాటు నాగబాబుకు మరో రెండు సినిమాల్లో పాత్రలను సైతం అల్లు అర్జున్ ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్నాడని చెప్పారు. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ జనసేనకు రెండు కోట్ల రూపాయల ఫండ్ సైతం ఇచ్చాడని పేర్కొన్నారు. అయినా అల్లు అర్జున్‌పై నాగ బాబు విషం చిమ్ముతున్నాడని ధ్వజమెత్తారు. అండగా నిలిచిన వారు, గీత ఆర్ట్స్ కుటుంబంపైనే నాగబాబు అక్కసు వెళ్లగక్కుతున్నాడని, మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనాలని చెప్పారు.