Nagababu : మెగా కుటుంబంకి సంబంధించి ఇటీవల వార్తలు ఎక్కువగా వస్తుండడం చూస్తూనే ఉన్నాం. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి వైరం ఉందని నెట్టింట తెగ ప్రచారాలు నడుస్తున్న సమయంలో అల్లు అర్జున్… తన స్నేహితుడు, నంద్యాల వైస్సార్సీపీ పై పోటీ చేస్తున్న రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి వెళ్లి తన సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఆలా చేసినందుకు అల్లు అర్జున్ విమర్శకులకు గురయ్యాడు. ఆ తరువాత మెగా బ్రదర్ నాగబాబు తన ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!,” అనూ పోస్ట్ చేశాక, అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టినదే అని అందరూ అనుకున్నారు.
పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు. అదే సమయంలో జనసేన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మెగా ఫ్యామిలీలో తీవ్ర చర్చనీయాంశమైంది . ఆ తర్వాత నాగబాబు ట్వీట్ చేయడం ఇంకా వివాదం వేడెక్కేలా చేసింది. వివాదాస్పద ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌కి కౌంటరే అని అంటూ ఉండటంతో.. అది అల్లు – మెగా ఫ్యామిలీస్ మధ్య వార్ హీట్ మరింత పెంచింది. బన్నీ ఆర్మీ.. ఆ ట్వీట్‌ని ఖండిస్తూ.. కామెంట్స్ పెడుతుండటంతో.. ట్విట్టర్‌ని బ్లాక్ చేసుకున్నారు నాగబాబు. దాంతో ఇక వివాదం ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో.. మూడ్రోజుల తర్వాత మళ్లీ ట్విట్టర్‌లోకి వచ్చిన నాగబాబు.. తాజా ట్వీట్‌తో యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది.
“నేను నా ట్విట్టర్ పోస్ట్ ను డిలీట్ చేశాను”, అంటూ మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. అంటే ఇంతకు ముందు అల్లు అర్జున్ ను ఉద్దేశించి పెట్టిన పోస్టును డిలీట్ చేశాను అని అర్ధమా? అని ఒక చర్చ నడుస్తోంది. అలా పోస్టు పెట్టినందువలన అతను మొత్తం ‘ఎక్స్’ నుండి తప్పుకోవాల్సి వచ్చిందా? అనేది కూడా ఇంకో టాక్ నడుస్తోంది. వివాదాస్పద ట్వీట్ తొలగించినా.. అల్లు ఫ్యాన్స్ వదలట్లేదు. తాజా ట్వీట్ పైనా జోరుగా కామెంట్స్ ఇస్తున్నారు. వాటిలో చాలా వరకు నెగెటివ్ కామెంట్సే ఉంటున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక, ఏం చేసినా బాగుంటుంది గానీ.. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అంటున్నారు కొందరు. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగేలా కనిపిస్తున్నా.. రెండు ఫ్యామిలీల్లో ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అనే సందేహం అందరిలోనూ ఉంది.