Posani Krishna Murali : ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తనని హత్య చేయడానికి కుట్ర పన్నాడంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసారు. తనపై పరువు నష్టం దావా వేసిన లోకేష్.. కోర్టుకు హాజరయ్యేటప్పుడు చంపాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనని మంగళగిరి తీసుకెళ్లి చంపాలని అనుకుంటున్నారని , తాను చచ్చిపోతే ఆ బాధ్యత నారా లోకేష్ తీసుకోవాలని పోసాని అన్నారు. లోకేష్ ఎవ్వరినీ విమర్శించలేదా అని ప్రశ్నించారు. బూతు పనుల వల్ల సమాజం పాడవుతుందంటూ చెప్పుకొచ్చారు.
ఇక నారా లోకేష్ మాట్లాడిన బూతుల వీడియోను పోసాని కృష్ణ మురళి ప్రదర్శించారు. నారా లోకేష్ 18 ఎకరాలు కొన్నారని తాను అన్నందుకు.. పరువు నష్టం దావా వేసినట్టు తెలిపిన పోసాని.. దీనికి తనపై 4 కోట్ల పరిహారం, 2 ఏళ్లు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందట అని చెప్పుకొచ్చారు. అయితే.. లోకేష్ చాలా మృదు స్వభావి అని.. కారులో కూడా బైనాక్యులర్స్ పెట్టుకుని చీమలకు సైతం హాని కలగకుండా వెళతారట అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. లోకేష్ అమ్మనా బూతులు తిడితే పరువు నష్టం దావా వేయకూడదా? నేను కనుక పరువు నష్టం దావా వేస్తే లోకేష్ 20 ఏళ్లు జైల్‌లో ఉండాల్సి వస్తుందన్నారు.
![Posani Krishna Murali : ఫారిన్ అమ్మాయిలతో బాబు గారు.. లోకేష్ నిజస్వరూపం బయటపెట్టిన పోసాని.. Posani Krishna Murali very angry comments on nara lokesh](http://3.0.182.119/wp-content/uploads/2023/08/posani-krishna-murali-1.jpg)
ఫారిన్ అమ్మాయిలతో మద్యం తాగి, తందనాలు ఆడిన లోకేష్ తనపై పరువు నష్టం కేసు పెడతాడా అంటూ పోసాని మండిపడ్డారు. అంతేకాదు లోకేష్ ఎంజాయ్ చేసే ఫొటోలని కూడా చూపించాడు పోసాని. తమది చాలా పేద కుటుంబమని.. డబ్బులు లేక తమ నాన్న ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తాను కష్టపడి పైకి వచ్చి సంపాదించానని పేర్కొన్నారు. తాను సంపాదించిన ఆస్తినంతా పేద వాళ్లకు ఇచ్చేస్తాననని.. ప్రతిఫలంగా అమరావతి రైతులు కోర్టు కేసులు వెనక్కి తీసుకుంటారా.. అంటూ పోసాని కృష్ణమురళి ఛాలెంజ్ విసిరారు. నారా లోకేష్ అంటే చాలామంది ఉంటారు. ఎవరో అనుకోవద్దు. చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త.. అతనే నా చావుకు కారణమౌతాడు.. అని పోసాని తేల్చి చెప్పారు. నారా లోకేష్ కంటే ఎంతో విశ్వసనీయత ఉన్న నాయకుడినని, అమ్ముడుపోయే వాడిని కాదని పోసాని అన్నారు.